• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • MAOIST LEADER JAGAN STRONG WARNING TO CM KCR AND PM MODI SK

మావోయిస్ట్ నేత జగన్ ఆడియో టేప్.. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి హెచ్చరిక

మావోయిస్ట్ నేత జగన్ ఆడియో టేప్.. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి హెచ్చరిక

ప్రతీకాత్మక చిత్రం

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌తో పాటు బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులపై దాడులు ఆపకపోతే ప్రజా క్షేత్రంలో శిక్షలు తప్పవని హెచ్చరించారు జగన్.

 • Share this:
  కొన్ని రోజులుగా ఉత్తర తెలంగాణ అడవుల్లో తీవ్ర అలజడి రేగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గిరిజన గ్రామాలు, అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ నేత జగన్ ఓ ఆడియో టేప్ విడుదల చేశారు. అందులో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌తో పాటు బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులపై దాడులు ఆపకపోతే ప్రజా క్షేత్రంలో శిక్షలు తప్పవని హెచ్చరించారు జగన్.

  ఆడియో టేప్‌లో జగన్ వార్నింగ్:

  భద్రాద్రి జిల్లా మల్లెపల్లి పోగు అడవులు, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం తొక్కగూడ అడవులల్లో మా దళాలను నిర్మూలించడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. గ్రేహౌండ్స్, పోలీసుల దాడులను అందరూ ఖండించాలి. ఊపా, ఎన్ఐఏ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేయాలి.

  జులై 15న తమ దళాలపై దాడులు చేశారు. భద్రాద్రి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ వరకు, గోదావరి ప్రాణహిత పరివాహక ప్రాంతంలో గ్రేహౌండ్స్, కోబ్రా దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీలో ఆపరేషన్ ప్రహార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు జల్లెడపడుతున్నాయి. జనవరి నుంచి మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో దాడులు చేస్తున్నారు. 40 మంది అమరులయ్యారు. 20 మంది విప్లవకారులు, ప్రజలను బూటకపు ఎన్ కౌంటర్ చేశారు.

  కరోనా సమయంలో మేం భౌతిక దాడులకు పాల్పడకుండా స్వీయ నియంత్రణ పాటిస్తుంటే.. ప్రజలను కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నారు. అనారోగ్యానికి, ఆకలి చావుకు గురిచేస్తున్నారు. 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలించాలని  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్ల సోదాలు, అక్రమ అరెస్ట్‌లతో ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు.

  వరవరరావు, సాయిబాబా అనారోగ్యంతో ఇబ్బందులు పెడుతున్నారు. జైల్లోనే చంపేయాలన్న కుట్రతో వైద్యం అందించడం లేదు. వారితో పాటు మరో 9 మందిని విడుదల చేయాలి. ఊపా, ఎన్ఐఏ కేసును ఉపసహరించుకోవాలి. దీన్ని ప్రజస్వామ్యవాదులు ఖండించాలి.

  బ్రాహ్మణీయ మతోన్మాద శక్తులు హిందూ రాజ్య నిర్మాణామే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కరోనా కష్ట సమయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

  ప్రజల కోసం పనిచేస్తున్న దళాలను ప్రజలు కాపాడుకోవాలి. దాడులు ఆపకపోతే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు. గ్రేహౌండ్స్ దళాలు ఉపసంహరించుకోవాలి.

  - జగన్, మావోయిస్టు నేత

  జగన్ ఆడియో టేపును తెలంగాణ జనసమితి పార్టీ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.
  Published by:Shiva Kumar Addula
  First published: