మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ‘భాస్కర్’ ఖండన

'నిన్న రాత్రి చుక్కాలు, బాజీరావులను పోలీసులు పట్టుకుని చంపారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణచివేతకు ఈ ఎన్‌కౌంటర్ ఉదాహరణ.’ అని ప్రకటనలో భాస్కర్ ఆరోపించారు.

news18-telugu
Updated: September 20, 2020, 10:01 PM IST
మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ‘భాస్కర్’ ఖండన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొమురం భీం అసిఫా బాద్ జిల్లాలో ఎన్ కౌంటర్ కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత భాస్కర్ తప్పించుకున్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరో ముగ్గురు మావోలు తప్పించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. భాస్కర్ లక్ష్యంగా ఇంకా అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై ఓ ప్రెస్‌నోట్‌ను భాస్కర్ విడుదల చేశారు. 'నిన్న రాత్రి చుక్కాలు, బాజీరావులను పోలీసులు పట్టుకుని చంపారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణచివేతకు ఈ ఎన్‌కౌంటర్ ఉదాహరణ. అరెస్టు చేయాల్సిన పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు. కార్డెన్ సెర్చ్ పేరుతో ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు' అని కేబీఎం కార్యదర్శి, మావోల కీలకనేత భాస్కర్ నోట్‌లో పేర్కొన్నారు. కాగజ్‌నగర్ మండలం, ఈజ్‌గామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంబ అడవుల్లో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోయిస్టులు తారసబడ్డారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు చనిపోయారు. ఈ తరుణంలో 15మంది మావోయిస్టు సానుభూతి పరులను ఆదిలాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉట్నూరు, సిర్పూర్‌ (యు), తిర్యాని, అసిఫాబాద్‌కు చెందిన ఆ సానుభూతి పరులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా నిన్న ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల కిట్‌ బ్యాగుల్లో పలువురు సానుభూతిపరుల పేర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంత కాలంగా వీరంతా మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు పోలీసులు నిర్థారించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 10:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading