హోమ్ /వార్తలు /తెలంగాణ /

Encounter: గడ్చిరౌలిలో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ మృతి..భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

Encounter: గడ్చిరౌలిలో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ మృతి..భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

Encounter

Encounter

Encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులపై మెరుపు దాడి చేశాయి పోలీసు బలగాలు. హోరా హోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా భారీగా పేలుడు పదార్ధాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gadchiroli, India

(K.Lenin,News18,Adilabad)

మహారాష్ట్ర(Maharashtra)లోని గడ్చిరోలి (Gadchirauli)జిల్లాలో మావోయిస్టులపై మెరుపు దాడి చేశాయి పోలీసు బలగాలు. హోరా హోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా భారీగా పేలుడు పదార్ధాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గడ్చిరోలి జిల్లా మౌజా తోడఘట్ట దగ్గర మావోయిస్టులు (Maoists)దాడికి పథకం వేసినట్లుగా సమాచారం అందుకున్న జవాన్లు ఎదురుదెబ్బ కొట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం ఉదయం 10గంటల సమయంలో అడవిలోని కొండపై నుంచి సుమారు 70మంది మావోయిస్టులు కాల్పులు బీజీఎల్‌, ఇతర ఆయుధాలతో కాల్పులు జరిపారు.అరగంటకుపైగా జరిగిన ఎదురు కాల్పులు జరిపి అటుపై అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అనంతరం నక్సలైట్లు కాల్పులు జరిపిన ప్రదేశానికి వెళ్లిన జవాన్ల(Soldiers)కు చనిపోయిన మావోయిస్టులు వదిలివెళ్లిన పేలుడు పదార్ధాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు సమీర్‌ అలియాస్ సాధు లింగ(Sadhu Linga)మోహన్దాగా గుర్తించారు.

మావోయిస్టులకు ఎదురుదెబ్బ..

ఇప్పటికే ఉనికిని కోల్పోతున్న మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. మౌజా తోడఘట్ట దగ్గర పోలీసులకు చెక్ పెడదామని ప్లాన్ వేసుకున్నారు మావోయిస్టులు. పక్కా సమాచారం బలగాలకు చేరడంతో ప్రత్యేక జవాన్లు, గడ్చిరౌలి పోలీసులు అదే ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టారు. పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోని కొండపై నుంచి సుమారు అరగంటకుపైగా కాల్పులు జరిపారు. అందుకు ప్రతీగా పోలీసులు ఎధురుకాల్పులు జరిపారు. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందడంతో నక్సలైట్లు పేలుడు పదార్ధాలను వదిలి అడవిలోకి పారిపోయారు.

45నిమిషాల పాటు కాల్పులు..

మావోయిస్టులు పారిపోవడంతో బలగాలు, పోలీసులు ఎన్‌కౌంటర్ ప్రదేశానికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలంలో ఒక మావోయిస్ట్ మృతదేహం లభ్యమయ్యింది. మరణించిన నక్సల్‌ను సమీర్ అలియాస్ సాధు లింగ మోహన్దా గా గుర్తించారు. అతనిపై 4 కేసులు నమోదయ్యాయనీ పోలిసులు తెలిపారు. 2018 లో పోస్టే భామ్రాగర్‌లో పోలీసులపై మెరుపుదాడి చేసినందుకు కేసు కూడా నమోదైంది.

Hyderabad: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గ్రేట్..ఎంపీ సంతోష్‌కు అవార్డు అందించిన నెట్‌వర్క్‌18

పేలుడు పదార్ధాలు స్వాధీనం..

ఈ ఘటనలో 1 కంట్రీ మేడ్ రైఫిల్, 1 భర్మార్ రైఫిల్, 1 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, 2 మ్యాగజైన్‌లు, 30 రౌండ్ల SLR రౌండ్లు, 8 ఎం. ఎం. 3 రౌండ్లు రైఫిల్, 12 బోర్ 4 రౌండ్లు, శాంసంగ్ కంపెనీ 1 ట్యాబ్లెట్, 1 రేడియో, నగదు స్వాధీనం చేసుకున్నారు.

శనివారం ఉదయం 10:00 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్ సుమారు 45నిమిషాల పాటు సాగిందని జవాన్లు, గడ్జిరౌలి జిల్లా పోలీసులు తెలిపారు.

First published:

Tags: Encounter, Maharastra

ఉత్తమ కథలు