Maoist : మన్యంలో ఉద్రిక్తత.. నేటి నుండి మావోయిస్టు ఆవిర్భావవారోత్సవాలు

మావోయిస్టు అవిర్భావ ఉత్సవాలు

Maoist : నేటి నుంచి.. మన్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దండకారణ్యం సరిహద్దు రాష్ట్రాల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య నిత్యం సాగే రగడ మరోసారి పడగవిప్పింది. ఇప్పటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

 • Share this:
  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  మావోయిస్టు(maoist) పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు కావడంతో ఏజెన్సీలో ఇప్పటికే కలకలం మొదలైంది. ఆవిర్భావ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు పట్టుదలతో ఉండగా.. ఉత్సవాలను ఎట్టి పరిస్థితుల్లో భగ్నం చేయాలని పోలీసులు(police) ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే వాహన తనఖీలు చేపట్టారు.

  మరోపక్క ఆవిర్భావ వారోత్సవాలను ఏజెన్సీలోని(Agency area) ప్రతి గూడేనికి తీసుకెళ్లాలని, ఆదివాసీలను పెద్ద ఎత్తున సమీకరించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్న మావోయిస్టు నాయకత్వం దీనికోసం భారీ కసరత్తే చేసింది. వారం ముందు నుంచే ఎక్కడికక్కడ కరపత్రాలను వెలసేలా చేయగలిగారు. ఆదివాసీల్లోకి మావోయిస్టు పార్టీ ఉద్యమ తీవ్రతను తీసుకెళ్లాలని భావించిన పార్టీ అగ్రనాయకత్వం దీనికోసం భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేనిది తొలిసారిగా కరపత్రాలు ఉంచిన చోట కూడా పోలీసులను టార్గెట్‌(police target) చేస్తూ మందుపాతర అమర్చడం మావోయిస్టుల వ్యూహాల్లో వచ్చిన మార్పును చెబుతోంది. ఎక్కడా ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితిలో తాము లేమని ఈ ఘటన చెప్పకనే చెప్పినట్లయింది.

  ఇది చదవండి :  పెళ్లికి ముందు బావా.. తర్వాత వరసకు సోదరుడు అయ్యాడు.. వారం రోజుల్లోనే పెళ్లింట విషాదం

  ఇలా చర్ల మండల కేంద్రంలోని ఓ కాలనీలో వెలసిన కరపత్రాన్ని చదవడానికి వెళ్లిన ఓ యువకుడు మందుపాతర పేలడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుండటంతో తెలంగాణ-చత్తీస్‌ఘడ్‌, తెలంగాణ- ఒడిషా సరిహద్దులు సహా ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ‌ బలగాలు (crpf,itbp)అడవుల్లో గాలింపు చేపడుతున్నాయి.

  ఏటా సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత పోలీసుస్టేషన్ల పరిధిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులు పోలీసులకు లొంగిపోవడం, అరెస్ట్‌ కావడం తదితర సంఘటనలతోపాటు ఏవోబీలో రెండు సార్లు ఎదురుకాల్పులు జరగడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  ఇది చదవండి :  పీజీ చేసి.. రోడ్లపై చీపురు పట్టింది.. స్వీపర్ నుండి ఎంటమాలజిస్టుగా మారింది..

  చత్తీస్‌ఘడ్‌, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు సహా ఆంధ్రప్రదేశ్‌లోని గూడెంకొత్తవీధి, సీలేరు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేపడుతున్నాయి.
  ప్రభుత్వ ఆస్తుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మన్యంలో తిరిగే రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ ఇప్పటికే మావోయిస్టుల వారోత్సవ సమావేశాలకు ఎవరూ హాజరు కావద్దని సూచిస్తూ ప్రకటన చేశారు.

  ఇప్పటికే అగ్రనాయకత్వం లొంగుబాటు పడుతూ మావోయిస్టు పార్టీ ఇబ్బందుల్లో ఉండగా.. మరోవైపు ఏటా నిర్వహించుకునే వారోత్సవాలపై సైతం తీవ్ర వత్తిడి పెరగడంతో మావోయిస్టుల్లో అలజడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులు ఎప్పుడు ఏంజరుగుతుందో అన్న భయం నెలకొంది.
  Published by:yveerash yveerash
  First published: