హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత మృతి

Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత మృతి

మావోయిస్టులు ( ప్రతీకాత్మక చిత్రం)

మావోయిస్టులు ( ప్రతీకాత్మక చిత్రం)

Maoist Encounter: బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎప్ కోబ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో మావోయిస్టు నేత హిడ్మా (Hidma)మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో (Telangana Border) ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎప్ కోబ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. 40 ఏళ్ల లోపు వయసున్న హిడ్మాకు మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్‌గా గుర్తింపు ఉంది. 17 ఏళ్లకే మావోయిస్టుల్లో చేరిన హిడ్మా.. కొద్దికాలానికే కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నట్టు చెబుతారు. బస్తర్ ప్రాంతంలోని మురియా గిరిజన వర్గానికి చెందిన మద్వి హిడ్మాను అనే 38 ఏళ్ల వ్యక్తి నక్సల్స్ నాయకుడు. అతడ ఫిలిప్పీన్స్‌లో గెరిల్లా వార్‌ఫేర్‌లో శిక్షణ పొందినట్లు సమాచారం. హిడ్మాను ఇంగ్లీష్‌తో పాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో నిష్ణాతుడని చెబుతారు.

అతడిని హిడ్మాలు, సంతోష్ అని కూడా పిలుస్తారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో 180-250 మంది మావోయిస్టు ఫైటర్స్ ఉంటారు. 21 మంది సభ్యులున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు కూడా హిడ్మానే.

హిద్మా బృందాలు చేసిన అనేక ప్రాణాంతక దాడులలో మే 2013లో కాంగ్రెస్ కాన్వాయ్‌పై జీరామ్ వ్యాలీ ఆకస్మిక దాడి కూడా ఉంది. ఇందులో చాలా మంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వీసీ శుక్లా వంటి నాయకులు సహా దాదాపు 32 మంది మరణించారు. హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు కూడా ఉంది.

Breaking News: తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారి..అధికారిక ఉత్తర్వులు జారీ

కరీంనగర్ యువకుడి అద్భుతం..తండ్రి కోసం బ్యాటరితో నడిచే బైక్ తయారీ

గతంలో ఒకసారి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే మావోయిస్టులు అప్పట్లో దీన్ని ఖండించారు. తాజాగా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు వార్తలు వస్తున్నా.. మావోయిస్టులు ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది.

First published:

Tags: Maoists