కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆపరేషన్ ప్రహార్ కు వ్యతిరేకంగా ఈ నెల 26 భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..గత వారం రోజుల క్రితం బంద్ ప్రకటన చేసిన మావోలు , దాన్ని విజయవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తమకు పట్టున్న రాష్ట్రాలు , ప్రాంతాల్లో ప్రజలు సహకరించాలని విజ్ఝప్తి చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వాల చర్యలకు నిరసన వ్యక్తం చేయడంతో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ..అనేక చోట్ల విధ్యంసం సృష్టించారు
ఈ నేపథ్యంలోనే చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఎర్రబోర్ దర్భా గూడేం వద్ద అటుగా వెళుతున్న ప్రైవేటు లారీలను ఆపి వేశారు. అనంతరం లారీ డ్రైవర్లను దింపి రేపు తలపెట్టిన బంద్‌కు మద్దతుగా లారీలను దగ్థం చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఓకేసారి లారీలను తగులపెట్టారు. మరోవైపు సుకుమా జిల్లా పోలీసు స్టేషన్ సమీపంలో ఓ లారీని దగ్థం చేశారు. అయితే ఇది చూసేందుకు వెళ్లిన స్థానిక యువకులపై బాణాలు, రాళ్లతో దాడి చేసినట్టు సమాచారం. ఇదే కాకండా నారాయణపూర్ జిల్లాలోని చోటే డోన్గార్ ప్రాంతంలో ఫారెస్ట్ పనులు చేస్తున్న జేసీబీని సైతం తగులబెట్టారు.
ఇక ఇదే తరహాలో దంతేవాడ జిల్లాలో గల భాసీ-బచేలి మధ్య అడవుల్లో వెళుతున్న ప్యాసింజర్ రైలును మావోలు నిలిపి వేశారు. ట్రాక్‌పై వెళుతున్న రైల్వే ట్రాక్ మధ్యలో ఎర్రజెండా పాతి సుమారు 45 నిమిషాలపాటు రైలు నిలిపివేశారు. అనంతరం బంద్ లో పాల్గోని మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం రైలుకు పోస్టర్లు అంటించి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Maoist attack, Maoist fire