జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ బాస్ ఎం.మహేందర్‌రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా రూపొందించాలన్న యోచనతోనే ప్రత్యేకంగా దృష్టి సారించడంతో..మావోల భావిత ప్రాంతాల్లో పోలీస్‌బాస్ స్వయంగా పర్యటిస్తున్నారు. ( Maoist annual celebrations ) ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో రహస్యంగా కలియతిరిగారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం చెన్నాపురం లో పర్యటించిన డిజిపి మహేందర్ రెడ్డి సరిహద్దుల్లో పరిస్థితులపై ఆరా తీశారు. వాహనాల తనిఖీలు, మవోయిస్టుల కదలికలు, కూంబింగ్ తీరుతెన్నులు, బేస్‌క్యాంపుల నిర్వహణ తీరు లాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
దీంతోపాటు రోజురోజుకూ పెరిగిపోతున్న గంజాయి అక్రమ రవాణాపైనా డీజీపీ ఆరా తీశారు. ఈ సందర్భంగా డీజీపీ భద్రాచలం సమీపంలోని సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్ లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పిలతో సమావేశం అయ్యారు. వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని ఆదేశించారు. ( Maoist annual celebrations ) సరిహద్దు ప్రాంతాలలో అనుమానితులను, మావోయిస్టు కార్యకలాపాలు కు చెక్ పెట్టేందుకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ, చత్తీస్‌గఢ్ అంధ్రా సరిహద్దులలో నిఘా పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మావోయిస్టుల పై ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా ఎస్పీలకు, ఏఎస్పీలకు సూచించారు.
Khammam : కొత్త లిక్కర్ పాలసీ షురూ.. గ్రామాల్లో మొదలైన సిండికెట్ దందా..
మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు ఏజెన్సీ అంతటా వారోత్సవాలను నిర్వహించాలని తలపెట్టారు. దీంతో ప్రజా ప్రతినిధుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.( Maoist annual celebrations ) వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమను తాము నిరూపించుకోడానికి ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడతారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో డీజీపీ క్షేత్ర స్థాయిలోని పోలీసులను అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏజెన్సీ లోకి ఆర్ టిసి బస్సులు నిలిపివేశారు. ప్రజాప్రతినిధులు ఎవరూ ముందస్తు అనుమతులు లేకుండా పర్యటించవద్దంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు.
Gadwala : భార్యపై కోపంతో సంవత్సరం కొడుక్కి పురుగుల మందు తాగించిన తండ్రి.
మావోయిస్టు పీఎల్‌జీఏ 21వ వారోత్సవాలను ఘనంగా పల్లెపల్లెనా నిర్వహించాలన్న చర్ల- శబరి ఏరియా మావోయిస్టు పార్టీ కార్యదర్శి అరుణ ఇచ్చిన పిలుపును నిర్వీర్యం చేయాలన్న లక్ష్యం పోలీసుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే గత ఏడాదిగా పోలీసుల వేట, కరోనా దాడి, ఇంకా ఇతర సమస్యలతో మావోయిస్టు పార్టీ ప్రధాన నాయకత్వాన్ని కోల్పోయింది.( Maoist annual celebrations ) దీని స్థానంలో పార్టీకి జవజీవాలను ఇవ్వాలన్న లక్ష్యంతో యువతను పార్టీలోకి ఆకర్షించాలన్న లక్ష్యంతో జరుగుతున్న మావోయిస్టుల ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలన్న వ్యూహంతో పోలీసులు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా డీజీపీ మహేందర్‌రెడ్డి తానే రంగంలోకి దిగి దిశానిర్దేశం చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DGP Mahendar Reddy, Maoist, Telangana