హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : భారీ వర్షాలతో పాలమూరు జిల్లాలో వరుస విషాదాలు.. మూడ్రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే ..

Telangana : భారీ వర్షాలతో పాలమూరు జిల్లాలో వరుస విషాదాలు.. మూడ్రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే ..

heavy rains

heavy rains

Telangana: గత కొద్ది రోజులుగా పాలమూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చెరువు, నదుల్లో స్నానాలు, ఇతర పనులకు వెళ్లిన వాళ్లు జలసమాధి అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎంత మంది చనిపోయారంటే..

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

(Syed Rafi, News18,Mahabubnagar)

ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు భయపెడుతున్నాయి. చెరువులు, కాలువల్లో పడి పలువురు మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చెరువులో నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. జడ్చర్ల (Jadcharla)మండల పరిధిలోగల పోలేపల్లి(Polepally)గ్రామానికి చెందిన ఆంజనేయులు(Anjaneyulu) 30 సంవత్సరాలు స్థానిక రంగనాయకుల చెరువులో ట్రాక్టర్ కడగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఏ తెలిపారు.

Rajanna Siricilla: 15 ఏళ్లు, 102 నేరాలు, 19 కేసుల్లో జైలు శిక్ష.. అయినా మారని బుద్ధి 

భారీవర్షాలతో మృత్యువాత..

మహబూబ్‌నగర్ మండలంలోని గండేడ్ గ్రామంలో చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుగ్గయ్య అనే 22 సంవత్సరాలు సెంట్రింగ్ పని చేసే కుర్రాడు ..దసరా రోజు స్నానం చేయడానికి దైవాలు చెరువుకు వెళ్లాడు. నీటిలో దిగిన తర్వాత మూర్చ రావడం ..ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇంతలో చెరువు కట్టపై బట్టలు ఉతుకుతున్న మిత్రులు గమనించిన కుటుంబ సభ్యులు సమాచారం అందించారు.

ఫిట్స్‌ రావడంతో జలసమాధి..

అతడిని బయటకు తీసి 108వాహనంలో నారాయణపేట జిల్లా కోస్గి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తేల్చారు.నిరుపేద కుటుంబాలు కావడంతో యువకుడి అంత్యక్రియలకు కూడా గ్రామస్తులు చందాలు వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ యువజన సంఘం సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ చంద్రకళ, ఎంపిటిసి సభ్యులు బాలయ్య కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం చేశారు.

Munugodu | Brs: మునుగోడులో టీఆర్ఎస్‌ కాదు బీఆర్ఎస్‌ పేరుతోనే పోటీ .. ఈసీ ఆమోదం కోసం చివరి వరకు ఎదురుచూపు

నదిలో స్నానానికి వెళ్లి..

కృష్ణానదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిన యువకుడు మృతి చెందిన సంఘటన షేర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రామకృష్ణ దంపతుల మనవడు నరేందర్ కుటుంబ సభ్యులతో కలిసి దసరా సందర్భంగా గ్రామ సమీపంలోని కృష్ణ నదికి చిన్నమ్మ కుమారుడుతో కలిసి వెళ్లాడు. బైక్‌ని కడిగిన తర్వాత నది ఒడ్డున ఉన్న తమ్ముడి వద్ద వాహనాన్ని పెట్టి నదిలో స్నానానికి వెళ్లాడు. కొద్దిగా ఈత వచ్చే నరేందర్ నదిలో మునిగిపోవడంతో అతడి తమ్ముడు పక్కనే ఉన్నవారికి సమాచారం ఇచ్చాడు. అప్పటికే పూర్తిగా మునిగిపోయిన కొద్దిసేపు గమనించిన నది ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వేసవిలో నదిలో మట్టి తరలింపు కారణంగా నదిలో లోతు ఏర్పడినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Heavy Rains, Mahbubnagar, Telangana News

ఉత్తమ కథలు