Home /News /telangana /

MANY BOYCOTT CHINESE PRODUCTS THIS DIWALI IN TELANGANA DETAILS HERE MS

Ban On Chinese Products: చైనా వస్తువులపై బ్యాన్.. దీపావళికి ఆ దేశ వస్తువుల విక్రయం ఢమాల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సరిహద్దులలో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు బుద్ది చెప్పాలని.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అపూర్వ మద్దతు లభిస్తున్నది. వోకల్ ఫర్ లోకల్ కు మంచి స్పందన వస్తున్నది.

  • News18
  • Last Updated :
    భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం విజయవంతంగా కొనసాగుతున్నది. సరిహద్దుల్లో చీటికి మాటికి కయ్యం పెట్టుకుంటున్న చైనా.. అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చడం లేదు. నిత్యం ఏదో ఒక గొడవకు దిగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొద్దినెలల క్రితమే చైనా వస్తువులపై బ్యాన్ వేసింది. కాగా ఈ దీపావళికి మార్కెట్ ను ముంచెత్తే చైనా వస్తువులేమీ ఈ ఏడాది కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా చాలా వరకు చైనా వస్తువులను వాడటానికి జనాలు ఆసక్తి చూపించడం లేదు.

    చైనా బ్యాన్ తో పాటు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ కు అపూర్వ స్పందన లభిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు చైనా వస్తువులంటేనే పట్టించుకోవడం లేదు. ఇక భాగ్యనగరంలోనూ చైనా మాల్స్ మూలకు పడుతున్నాయి. హైదరాబాద్ లో ప్రముఖ మార్కెట్లుగా పేరున్న జనరల్ బజార్, అబిడ్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ లలో చైనా ఉత్త్పత్తులకు గిరాకీ లేదని అమ్మకందార్లు చెబుతున్నారు. పండుగ షాపింగ్ సందర్భంగా మార్కెట్ కు వచ్చే వినియోగదారులు ఎవరూ చైనా వస్తువులు కొనడం లేదని వారు అంటున్నారు. సాధారణంగా దీపావళికి ప్రతి ఏడాది చైనీస్ లైట్లు, క్రాకర్స్, బాణసంచా, ఇతర టపాసులు, ప్రమిదల వంటివి చైనా నుంచి భారీగా దిగుమతి అయ్యేవి. జనాలు కూడా గతంలో వాటిని విరగబడి కొనేవారు.

    కానీ సరిహద్దుల్లో పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు చైనా వస్తువులంటేనే జనాలు ముఖం చాటేస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల్లో 40 శాతం కూడా అమ్మడవడం లేదని విక్రయదారులు అంటున్నారు. ఈ ఏడాది ఢిల్లీ, ముంబయి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాటినే జనం ఎగబడి కొంటున్నారని వారు తెలిపారు. చైనీస్ ఉత్పత్తులైన లాంతర్లు, గాడ్జెట్లు, అలంకార వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, గడియారాలు, ఇతర వస్తువులను ఎవరూ అడగడం లేదని వాళ్లు వాపోతున్నారు.

    ఇదిలాఉండగా.. చైనా వస్తువులను నిషేధించాలని.. పర్యవరణాన్నికాపాడాలని పలు విద్యా సంస్థలు కూడా వారి పిల్లలకు చెబుతున్నాయి. దీపావళి కోసం వారి పిల్లల చేతే సృజనాత్మకత వెల్లివిరిసేలా.. అలంకరణ వస్తువులను తయారుచేసి వాటిని మార్కెట్లలో అమ్మకానికి పెడుతున్నాయి. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఉండే కార్మికులు ఉపాధి పొందుతారని.. పలువురు షాప్ ఓనర్లు చెబుతున్నారు. ఏదేమైనా భారత్ తో కయ్యానికి దిగుతున్న చైనాకు దాని దారిలోనే వెళ్లి బుద్దిచెప్పాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరిస్తుండటం శుభపరిణామం.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Indo China Tension, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు