హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mancherial: ప్రాణం తీసిన మాంజా.. రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా మెడకు చుట్టుకున్న పతంగి దారం...

Mancherial: ప్రాణం తీసిన మాంజా.. రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా మెడకు చుట్టుకున్న పతంగి దారం...

మాంజా (Manja) తో అప‌శృతి దొర్లింది. సంక్రాంతి పూట పతంగుల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది.

మాంజా (Manja) తో అప‌శృతి దొర్లింది. సంక్రాంతి పూట పతంగుల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది.

మాంజా (Manja) తో అప‌శృతి దొర్లింది. సంక్రాంతి పూట పతంగుల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది.

  సంక్రాంతి పండుగ (Sankranti festival) అంటేనే తీపి.. పిండి వంటలు.. పతంగులు ఎగ‌రేయడం ప్రత్యేకత. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా కేరింతలు కొడుతూ పిండివంటలు తింటూ స్వేచ్ఛగా గత మూడు రోజుల పాటు సంబురాలు జరుపుకుంటారు. తెలంగాణ (Telangana)లో సంక్రాంతి అంటే కైట్స్ ఎగ‌రేయడం. వాటికి వాడే దారం మంచిది కావాల‌ని డ‌బ్బులు పెట్టి విలువైన మాంజా (దారం) కొంటారు. అయితే మాంజా (Manja) తో అప‌శృతి దొర్లింది. సంక్రాంతి పూట పతంగుల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది.

  అతని భార్యకు కూడా..

  మంచిర్యాల (Mancherial) జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి (Died) చెందాడు. అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

  కాగా, అటు కామారెడ్డిలోనూ మాంజా తగిలి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని షేక్ సన్ హోటల్ ఎదురుగా మెయిన్ రోడ్ పై వెళ్తున్న ఇస్లాంపూర్ చెందిన మహమ్మద్ ఏజ్ కు పతంగి మాంజా గొంతు (Throat)కు తగిలి తీవ్ర గాయం అయింది. బైక్ పై వెళుతుండగా ఈ జరిగిన ఘటన జరిగింది. సంక్రాంతి సందర్భంగా బిల్డింగ్ పై నుంచి పతంగులు ఎగర వేస్తుండగా ఓ పతంగి దారం అతనికి తగిలి ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని మెరుగైన‌ వైద్యం కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువకుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయట ప‌డ్డాడు.. చికిత్స పొందుతున్నాడు.

  గతంలో ఈ పతంగులను (Kites) ఎగరేసేందుకు కాటన్ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా, గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన చైనా మాంజా రాజ్యమేలుతోంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లు తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, 10 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయినా ఇప్పటికీ నగర మార్కెట్లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

  First published:

  Tags: Macherla Niyojakavargam, Mancherial, Sankranti

  ఉత్తమ కథలు