Covid 19: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని తారుమారు చేశారు. మృతదేహం ప్యాక్ చేసి ఉండడం తో బంధువులు అలానే ఖననం చేశారు. అరగంట తరువాత ఖననం చేసిన మృతడేహన్ని తవ్వి అసలు బంధువులు తీసుకెళ్లారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కోత్తగట్టు గ్రామానికి చెందిన జానపట్ల మచ్చయ్య(55)కు కరోనా పాజిటివ్ వచ్చింది. మచ్చయ్యా ఆరోగ్య పరిస్తితి విషమించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మచ్చయ్య మృతి చెందారు. దీంతో కరోనా నిబంధనల ప్రకారం మృత దేహాన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. దీంతో మాచ్చయ్య కుటుంబ సభ్యులు మృతడేహాన్ని కొత్తగట్టు లో ఖననం చేశారు. ఇంతలో ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది. మచ్చయ్య మృతదేహానికి బదులు వేరొకరి మృతదేహాన్ని ఇచ్చామని, ఆయన మృతదేహాన్ని తాము తీసుకువస్తున్నామని చెప్పారు.
మచ్చయ్య మృతదేహాన్ని తెచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత పూడ్చిన మృతదేహాన్ని బయటికి తీసి తీసుకెళ్లారు. ఈ విషయం పై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలను సంప్రదిస్తే ఎవరూ స్పందించడం లేదు. ఇటువంటి పొరపాటే సిద్దిపేట కోవిడ్ సెంటర్లో జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షంతో బంధువులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని బాధితులు వాపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.