Manchu Manoj : తెలంగాణ మంత్రులతో హీరో మంచు మనోజ్ భేటి కావడం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటిలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి రెడ్డిలతో మంచు మనోజ్ తెలంగాణలోని టూరిజం పై చర్చించారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన టూరిజం ప్రాజెక్ట్స్‌తో పలు అంశాలు చర్చించారు. అనంతగిరిలో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 150 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వచ్చారన్నారు. ఇందులో సినిమావాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు.
అనంతగిరితో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి టూరిజం ప్రాజెక్ట్స్‌ను ఈ విధంగానే చేపట్టనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలపిారు. ఈ టూరిజం ప్రాజెక్ట్‌తో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
Actor @HeroManoj1 met with the Honorable ministers @SabithaindraTRS, @VSrinivasGoud and discussed about his adventures tourism project, wellness centers establishment. The ministers are also in the favor of these projects and ordered field level officers to make a report. pic.twitter.com/d8UvmiUtZZ
మంచు మనోజ్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని మంచు మనోజ్.. ఇపుడు తన ఆశలన్ని ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.