కేటీఆర్‌కు మంచు మనోజ్ సరదా కౌంటర్

కేటీఆర్‌కు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన మంచు మనోజ్... ఆయన సరదా ట్విట్‌కు అంతే సరదాగా కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: July 24, 2019, 6:26 PM IST
కేటీఆర్‌కు మంచు మనోజ్ సరదా కౌంటర్
మంచు మనోజ్(ఫేస్‌బుక్ ఫోటో)
news18-telugu
Updated: July 24, 2019, 6:26 PM IST
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సినీనటుడు మంచు మనోజ్ సరదాగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మంచు మనోజ్ కేటీఆర్‌ను సూటిగా మాట్లాడే వ్యక్తిగా అభివర్ణించాడు. ఎంతోమందికి మీరు ఆదర్శం అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన కేటీఆర్... సంగారెడ్డిలో నీ ఓటు నాకే వేయాలి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో మంచు మనోజ్ పేరుతో ఒక ఓటరు కార్డు వెలుగు చూడటంతో... దాన్ని ఉద్దేశించి కేటీఆర్ ఈ రకంగా వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్‌ ట్వీట్‌కు అంతే సరదాగా కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్... ఈ సారి తాము ఓటు వేయబోయేది తిరుపతి నుంచి అన్న అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ ఓటరు జాబితాలో మంచు మనోజ్‌ పేరు ఉండటం కొద్ది రోజుల క్రితం కలకలం రేపింది. మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో ఓటర్ల జాబితాలో మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు పేరుతో ఓటు హక్కు కల్పించారు. ఇది పొరపాటున జరిగిందా? లేక అకతాయి తనంగా కావాలనే చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తహశీల్దార్‌ను లిఖితపూర్వక వివరణ కోరారు. బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.


First published: July 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...