హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR : కేటీఆర్​ పుట్టినరోజుకు హాజరుకాని ప్రభుత్వోద్యోగులకు నోటీసులు.. పూర్తి వివరాలివే..

KTR : కేటీఆర్​ పుట్టినరోజుకు హాజరుకాని ప్రభుత్వోద్యోగులకు నోటీసులు.. పూర్తి వివరాలివే..

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

మంచిర్యాల (Mancherial) జిల్లాలో నిర్వహించిన మంత్రి కేటీఆర్​ పుటిన రోజు (KTR Birthday) వేడుకలపై దుమారం రేగుతోంది. ఈ వేడుకలకు హజరుకాని నలుగురు మున్సిపల్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కారణం.

  మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటిలో నిర్వహించిన మంత్రి కేటీఆర్​ పుటిన రోజు (KTR Birthday) వేడుకలపై దుమారం రేగుతోంది. ఈ వేడుకలకు హజరుకాని నలుగురు మున్సిపల్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఈ దుమారానికి కారణమయ్యింది. ఈ నెల 24వ తేదీన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో (Municipal Office) రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. బెల్లంపల్లి శాసన సభ్యుడు దుర్గం చిన్నయ్య ఈ వేడుకలకు హజరై కేక్ కట్​ చేసి సంబురాలు జరుపుకున్నారు. అయితే సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, సిస్టం మేనేజర్ మోహన్, బిల్ కలెక్టర్ శ్రావణ్ ఈ వేడుకలకు హజరు కాలేదు.

  గైర్హాజరుకు కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని..

  దీంతో ఆగ్రహించిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హజరు కాని ఆ నలుగురు మున్సిపల్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గైర్హాజరుకు కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో వేడుకలు జరగగా, హజరుకాని మున్సిపల్ ఉద్యోగులకు మరునాడు అంటే సోమవారం నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.

  TSRTC: మహిళలకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రాఖీ పండుగ కానుకగా మరో ఆఫర్​..

  అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యక్తి గత కారణాలతో హజరు కాలేకపోయినప్పటికి, అధినేత మెప్పుకోసం స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే కమిషనర్ మున్సిపల్ ఉద్యోగులకు ఇలా షోకాజ్ నోటీసులు జారీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ ఘటన నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి. గతం ఎప్పుడు లేని విధంగా ఓ మంత్రి పుట్టిన రోజు వేడుకలకు హజరు కాలేదని ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

  KCR | New scheme for women: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళల కోసం కొత్త పథకం.. వివరాలివే..

  కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు (Birthday Celebrations) దూరంగా ఉన్నారు కేటీఆర్​. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేస్తూ మానవత్వం చాటుకున్నారు. అయితే మంచిర్యాలలో మాత్రం ఇలా ఉద్యోగులకే షోకాజ్​ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాశం అయింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Birthday, Employees, KTR, Mancherial, Telangana Government

  ఉత్తమ కథలు