హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad: ఎనిమిది రోజులుగా తల్లులు జైళ్లో.. బిడ్డలు అడవిలో.. ఎట్టకేలకు బెయిల్​పై విడుదలైన ఆదివాసీలు

Adilabad: ఎనిమిది రోజులుగా తల్లులు జైళ్లో.. బిడ్డలు అడవిలో.. ఎట్టకేలకు బెయిల్​పై విడుదలైన ఆదివాసీలు

తల్లి కోసం చూస్తున్న ఓ కొడుకు

తల్లి కోసం చూస్తున్న ఓ కొడుకు

పోడు భూముల వివాదంలో అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న 12 మంది ఆదివాసీ గిరిజన మహిళలు బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుండి విడుదలైన గిరిజన మహిళలకు కాంగ్రెస్ నేతలు సురేఖ, సుజాత స్వాగతం పలికారు.

  ఆదిలాబాద్ (Adilabad)జిల్లా జైలు లో ఉన్న మంచిర్యాల (Mancherial) జిల్లా కోయ పోష గూడెం కు చెందిన 12 మంది ఆదివాసి గిరిజన మహిళలు బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. కాంగ్రేస్ పార్టీకి చెందిన నాయకులు గిరిజన మహిళలకు (Tribal women) బెయిల్  పేపర్లు తీసుకురావడంతో జైలు అధికారులు వీరిని విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా దండె పల్లి మండలం మాకులపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోయపోషగూడెం కు చందిన నాయక్ పోడు ఆదివాసి గిరిజన మహిళలు పోడు భూముల్లో వానాకాలం సాగు కోసం తుప్పులు తొలంగించేందుకు వెళ్ళారు. అయితే కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి (Tiger reserve forest) ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించారని, చెట్లు నరికి అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని  అటవీ అధికారులు 12 మంది నాయక్ పోడు గిరిజన మహిళలపై (Tribal women) కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారిని లక్షెటిపేట హజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించారు.

  జైలు నుంచి బయటకు వస్తున్న మహిళలు

  ఎనిమిది రోజుల తర్వాత వారు బెయిల్ (Bail) పై విడుదల కావడంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆదిలాబాద్ కు చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత జైలు వద్ద బయటకు వచ్చిన మహిళలకు కండువాలు కప్పి, పూల మాలలు వేసి స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే గిరిజన మహిళల అరెస్ట్ జిల్లాలో వివాదస్పదమైంది. తమ తాత తండ్రుల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూముల్లోకి తాము పుల్లలు ఏరేందుకు వెళితే తమను అక్రమంగా అరెస్టు చేశారని మహిళలు ఆరోపీంచారు. అటవీ అధికారులు మహిళలు అని కూడా చూడకుండ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కాలి బూట్లతో తన్నారని మహిళలు వాపోయారు. చిన్నపిల్లలు ఉన్నారన్నా పట్టీంచుకోకుండా జైలు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.

  అయితే ఆదివాసి మహిళలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో కాంగ్రెసా పార్టీ తోపాటు గిరిజన సంఘాలు కూడా  ఆందోళనలు చేపట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క  రెండు రోజుల క్రితం జిల్లా జైలు కు వచ్చిన ఆదివాసి మహిళలను పరామర్శించి వెళ్ళారు. మరోవైపు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటి చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

  ఆదివాసి మహిళల విడుదల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కిరాల సురేఖ, గండ్రత్ సుజాత మీడియాతో మాట్లాడుతూ చంటి పిల్లల తల్లులు అని కూడా చూడకుండా అరెస్టులు చేయడమేమిటని ప్రశ్నించారు. మహిళల పట్ల అతిగా వ్యవహరించిన ఫారెస్ట్ రేంజర్, బీట్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  పిల్లలు

  52 కుటుంబాలు..

  కోయపోచగూడ గ్రామ జనాభా 200. ఇక్కడ 52 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇందులో కొందరు తడకలు అల్లుతూ ఉపాధి పొందుతుంటే, మరికొందరు ఏళ్ళుగా పోడు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ నెల ఒకటవ తేదీన కోయపోచగూడ కు చెందిన మోదీతే పోసవ్వ, మాదికుంటా శాంతవ్వ, మాదికుంటా రజిత, గుడిపెల్లి లక్ష్మీ, గుడిపెల్లి పెద్దలక్ష్మీ, మాదికుంట శైలజ, జైనేని లావణ్య, దోసండ్ల లచ్చవ్వ, దోసడ్ల శ్యామల, దోసండ్ల గంగవ్వ, మాదికుంట రాజవ్వ పై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అయితే ఇందులో కొందరు మహిళలకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. తల్లులు జైలులో ఉండటంతో వారి పిల్లలు తల్లడిల్లిపోయారు. గ్రామస్థులే వారి ఆలన పాలనా చూశారు. చివరకు జైలులో ఉన్న మహిళలకు బెయిలు పై విడుదల కావడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆ చిన్నారులు తమ తల్లి ఒడి చేరే అవకాశం లభించింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Forest, Mancherial

  ఉత్తమ కథలు