(కట్టా లెనిన్, న్యూస్18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన ఆరుగురి సజీవ దహనం ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుమారు 16 ప్రతేక పోలీసు బృందాలతో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కొంత పురోగతి కూడా లభించినట్లు తెలిసింది. అయితే మొదట ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావించినప్పటికి పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. పథకం ప్రకారం ఇంటికి నిప్పంటించినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ.. నిన్న ఘటన స్థలంలో లభ్యమైన పెట్రోల్ క్యాన్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Crime : ఫోన్ మాట్లాడుతోందని కూతుర్ని చంపేసిన తండ్రి
ఇంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుపారీ గ్యాంగ్ పనే అని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీరాంపూర్ లోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేసి క్యాన్‌లలో నింపుకొని ఆటోలో తీసుకువెళ్ళిన వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు బంక్ లభ్యమైన సిసి ఫుటేజి ఆధారం దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. గుడిపల్లి గ్రామానికి వెళ్ళే రహదారి వెంట ఉన్న అన్ని పెట్రోల్ బంకులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో శాంతయ్య కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు నమ్ముతున్న పోలీసులు ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిన్నటి ఘటనలో సజీవ దహనమైన శివయ్య భార్యకు సింగరేణిలో పనిచేస్తున్న శాంతయ్యకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే శాంతయ్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేక అతడి కుటుంబ సభ్యులు గతంలో గొడవ పడినట్లు తెలుస్తోంది. గతంలో శాంతయ్యపై హత్యా యత్నం కూడా జరిగినట్లు సమాచారం. శాంతయ్య మరో రెండేళ్ళలో రిటైర్డ్ కాబోతున్నాడు. అలాగే శాంతయ్యకు లక్షేట్టిపేటలో ఆస్తులు కూడా ఉన్నాయి. ఎక్కడ వాటిని సహజీవనం చేస్తున్న మహిళ సంతానానికి ఇస్తాడేమోనని భావించి శాంతయ్య భార్య , వారి కుమారులు, కుమార్తె కలిసి సుపారి గ్యాంగ్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే రామ గుండంలో హెడ్ నర్స్‌గా పనిచేస్తున్న శాంతయ్య భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీడ ఈ సజీవ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధాలే ఈ ఘటనకు అసలు కారణంగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Mancherial