కారు పాస్ ఇచ్చేందుకు ఫ్రీజ్ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచిర్యాల ఏసీసీ లక్ష్మీనారాయణపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో వెంటనే ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వివరాల్లోకి వెళితే... ఏసీపి జారీచేసిన కారు పాస్‌తో ఓ వ్యక్తి హైదరాబాద్‌కి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి స్నేహితుడు... తాను కూడా ఇదే తరహాలో పాస్ పొందాలని ప్రయత్నించాడు. తనకూ అదే తరహాలో కారు పాస్ ఇవ్వాలని రాచకొండ కమిషనర్‌ను రిక్వెస్ట్ చేశాడు. అతడి మాటలకు షాక్ తిన్న రాచకొండ కమిషనర్ అతడి విజ్ఞప్తిని తిరస్కరించారు.
మంచిర్యాల ఏసీపీ రిఫ్రిజిరేటర్ తీసుకుని తన స్నేహితునికి కార్ పాస్ ఇచ్చారని.. తనకూ ఇవ్వాలని రాచకొండ కమిషనర్‌కు వివరించాడు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించగా.. ఏసీపీ ఫ్రీజ్ తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆ కారు పాస్ ద్వారా హైదరాబాద్ వచ్చిన వ్యక్తి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల ఏసీపీని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Telangana, Telangana Police