హైదరాబాద్‌.. వరద నీటిలో ఓ వ్యక్తి గల్లంతు..

news18-telugu
Updated: September 21, 2020, 6:47 AM IST
హైదరాబాద్‌.. వరద నీటిలో ఓ వ్యక్తి గల్లంతు..
హైదరాబాద్‌లో వర్షాలు(ఫైల్ ఫొటో)
  • Share this:
భారీ వర్షాలు కురుస్తున్న వేళ చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు హైదరాబాద్ నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే నేరేట్‌మెట్‌కు చెందిన చిన్నారి సుమేధ సైకిల్‌ వెళుతూ నాలాలో పడి కొట్టకుపోయి.. ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఇది జరిగి నాలుగైదు గడవకముందే వరదనీటిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన సరూర్‌నగర్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. బాలపూర్‌ ప్రాంతంలోని పలు కాలనీలకు చెందిన వరదనీరు సరూర్ నగర్ మినీట్యాంక్బండ్‌లో కలుస్తోంది. భారీ వర్షాలు పడుతుండటంతో పెద్ద ఎత్తున వరదనీరు మినీట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.

అయితే వరదనీరు వెళ్తున్న మార్గంలోని తపోవన్ కాలనీ వద్ద స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడిపోయాడు. వరదనీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ప్రవాహం అధికంగా ఉండటంతో కుదరలేదు. గల్లైంతన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక, నగరంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రోడ్లపైకి భారీగా నీళ్లు చేరడం, నాలాలు పొంగిపోర్లడంతో బయటకు వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలుజిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Published by: Sumanth Kanukula
First published: September 21, 2020, 6:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading