MAN SUSPICIOUS DEATH IN JANGAON DISTRICT HOUSE OWNER COMPLAINTS ABOUT IT ONE DAY AFTER HSN
మంచంపై కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి శవం.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా అద్దెంట్లో ఒంటరిగా.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
’సర్, మా ఇంట్లోకి నిన్న (మార్చి 19న) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దూరారు. మా ఇంట్లో అద్దెకు ఉంటున్న అన్నబోయిన భాస్కర్ ను గొడ్డలితో నరికి చంపేశారు. నాకు భయం పుట్టి నేను పారిపోయాను. ఈ విషయం మీకు తెలియజేయాలని వచ్చాను‘ అంటూ..
కొందరు పోలీసులు యమా స్పీడుతో ఓ ఇంటికి వచ్చారు. ఓ ఇంటి తలుపులు తీశారు. అంతే తీవ్ర దుర్వాసన. ముక్కులు మూసుకుని మరీ ఆ పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. మంచంపై ఓ శవం. కుళ్లిపోతున్న స్థితిలో వారికి కనిపించింది. మెడ, వీపు భాగాల్లో గొడ్డలితో నరికిన గుర్తులు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు ఆ మృదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన అన్నబోయిన భాస్కర్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆలేరులో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే మొదటి భార్యను వదిలేశాడు.
ఆ తర్వాత 14 ఏళ్ల క్రితమే రఘునాథపల్లికి చెందిన మమత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య మమతకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయితే ఇటీవల కొద్ది కాలంగా రెండో భార్యతో కూడా భాస్కర్ కు విబేధాలు వచ్చాయి. ఆమెతో తరచూ గొడపడేవాడు. దీంతో ఆమెను కూడా విడిచిపెట్టి రఘునాథపల్లి చెందిన చందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతడు కూడా ఒంటరిగానే నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం సమయంలో చందర్ రెడ్డి జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ’సర్, మా ఇంట్లోకి నిన్న (మార్చి 19న) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దూరారు. మా ఇంట్లో అద్దెకు ఉంటున్న అన్నబోయిన భాస్కర్ ను గొడ్డలితో నరికి చంపేశారు. నాకు భయం పుట్టి నేను పారిపోయాను. ఈ విషయం మీకు తెలియజేయాలని వచ్చాను‘ అని చెప్పాడు.
దీంతో పోలీసులు హుటాహుటిన ఘటన జరిగిన ఇంటికి వెళ్లారు. ఆ గదికి బయట తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు తీసి లోపలికి వెళ్లి చూస్తే మంచంపై కుళ్లిపోయిన స్థితిలో భాస్కర్ మృతదేహం కనిపించింది. గొడ్డలితో అతడిపై దాడి చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం భాస్కర్ మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై భాస్కర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చందర్ రెడ్డి ప్రవర్తన తీరు అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు తెలిపాడు. మద్యం తాగిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందనీ, ఈ క్రమంలోనే హత్య జరిగి ఉంటుందని అతడు అనుమానిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.