Warangal: ముగ్గురు యువతులతో పరిచయం.. కట్ చేస్తే ఆస్పత్రిలో యువకుడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

సందీప్ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడు ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది.

  • Share this:
    సాధారణంగా యువతులకు యువకులు వేధించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓయువకుడి కొందరు యువతులు వేధింపులకు గురిచేశారు. ప్రేమిస్తున్నాని చెప్పి యువతి.. మరో ఇద్దరితో కలిసి బెదిరింపులకు పాల్పడింది. ఈ వేధింపులు తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. రాయపర్తి మండలంమొరిపిరాల గ్రామానికి చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు సందీప్‌ ఎంఎల్‌టీ కోర్సు పూర్తిచేశాడు. ప్రస్తుతం సందీప్ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

    అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సందీప్‌కు ముగ్గురు అమ్మాయిలు పరిచయం అయ్యారు. వీరిలో ఒక యువతి సందీప్‌ను ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. ఆ మాటలను నమ్మిన సందీప్‌ ఆమె వలలో పడిపోయాడు. అయితే కొద్ది రోజులకు ప్రేమించినట్టు చెప్పిన యువతి.. అతడిని వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలోనే మిగిలిన ఇద్దరు యువతులు సందీప్‌కు ఫోన్ చేసి.. ‘నీ ప్రియురాలు చనిపోయింది. అందుకే నువ్వే కారణం’ అని చెప్పి బెదిరించారు. దీంతో సందీప్ ఆందోళన చెందాడు.

    ఇవి చదవండి: Online Classes: ఆన్‌లైన్ క్లాసులు.. ఈ పిల్లాడికి జరిగినట్టుగా మరెవరికి జరగకూడదు..
     Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. పట్టపగలే యువతిపై అత్యాచారం.. పోలీసులు ఏం చెప్పారంటే..


    మరోసారి కూడా ఇలాంటి బెదిరింపులే ఎదురుకావడంతో.. అతను కఠిన నిర్ణయం తీసుకన్నాడు. తన సొంతూరు మొరిపిరాల వచ్చి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: