అర్ధరాత్రి మద్యం షాపులోకి దూరి.. ఓ యువకుడు చేసిన నిర్వాకమిది.. సీసీ కెమెరాలో అడ్డంగా బుక్కయ్యాడు!

చోరీకి పాల్పడుతున్న యువకుడు

మద్యం షాపులను కూడా టార్గెట్ చేసుకుని యజమానులకు దొంగలు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ మద్యం షాపులో చోరీ జరిగింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ చోరీకి సబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఆ దొంగ చేసిన నిర్వాకమేంటో వీడియోలో మీరే చూడండి.

 • Share this:
  ప్రస్తుతం దొంగలు కూడా అప్ డేట్ అయ్యారు. ఇళ్లల్లోనూ, బ్యాంకుల్లోనూ, ఏటీఎం కేంద్రాల్లోనే కాదు, తాజాగా మద్యం షాపులను కూడా టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. అధిక లావాదేవీలు జరిగే మద్యం షాపుల్లో యజమానులు కొంత డబ్బును షాపులోనే ఉంచి తాళం వేసి వెళ్తుంటారు. ప్రధాన రహదారిపై ఉండే షాపే కాబట్టి చోరీ ఏమీ జరగదని వారి నమ్మకం. అయితే వారి నమ్మకాన్ని దొంగలు వమ్ము చేస్తున్నారు. మద్యం షాపులను కూడా టార్గెట్ చేసుకుని యజమానులకు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో రేగుంట గ్రామంలోని ఓ మద్యం షాపులో చోరీ జరిగింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ చోరీకి సబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.

  జగిత్యాల జిల్లాలోని రేగుంట గ్రామంలో ఓ వైన్ షాపు ఉంది. దీని షట్టర్ ను ఓ యువకుడు అర్ధరాత్రి తెరచి లోపలికి వచ్చాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఆ షట్టర్ ను ఓ మనిషి పాకుతూ రాగలిగేంత వరకే తెరచి ఉంచాడు. ముఖం ఆనవాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా ముసుగు వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ షాపులో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలిసిన వ్యక్తిలా లాకర్లలోని డబ్బును తీశాడు. టేబుల్ పై పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుకున్నాడు. కొన్ని మద్యం బాటిళ్లను కూడా నల్లటి కవర్లలో పెట్టి షట్టర్ ముందు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ షాపులోనే ఉన్న ఓ చేతి సంచీలో డబ్బను పెట్టుకుని షట్టర్ లోంచి పాకుతూ బయటకు వెళ్లిపోయాడు. ఈ నెల పద్దెనిమిదో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారిన తర్వాత షాపును తెరిచేందుకు వచ్చిన యజమాని దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించాడు.

  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు ఐదు లక్షల రూపాయల డబ్బు చోరీకి గురయినట్టు యజమాని గుర్తించాడు. అయితే షాపులో సీసీ కెమెరా ఉండటంతో ఆ యువకుడు చేసిన నిర్వాకమంతా రికార్డయింది. దొంగతనానికి సంబంధించిన వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. బాగా తెలిసిన వ్యక్తే ఈ నిర్వాకానికి పాల్పడి ఉండవచ్చుననీ, విచారణ చేసిన నేరస్థుడిని తర్వలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. దాదాపు ఐదు లక్షలకు పైగా డబ్బు చోరీకి గురవడంతో రేగుంట గ్రామంలో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
  Published by:Hasaan Kandula
  First published: