• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • MAN LOSS RS 14 LAKH DUE TO ONLINE FRAUD IN THE NAME OF MARRIAGE IN HYDERABAD HSN

Hyderabad: పెళ్లికి సరిగ్గా రెండ్రోజుల ముందు.. పెళ్లికూతురి ఫోన్ స్విచాఫ్.. వరుడికి అసలు విషయం తెలిసి మైండ్ బ్లాంక్..!

Hyderabad: పెళ్లికి సరిగ్గా రెండ్రోజుల ముందు.. పెళ్లికూతురి ఫోన్ స్విచాఫ్.. వరుడికి అసలు విషయం తెలిసి మైండ్ బ్లాంక్..!

ప్రతీకాత్మక చిత్రం

తాను ప్రాణంగా ప్రేమించిన యువతి తన భార్యగా రాబోతోందని అతడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. పెళ్లికి సరిగ్గా రెండ్రోజుల సమయం ఉందనగా తన ప్రేయసికి ఫోన్ చేశాడు. పెళ్లి పనులు ఎలా జరుగుతన్నాయని కనుక్కోవాలనుకున్నాడు. కానీ ఫోన్ స్విచాఫ్. ఎన్ని సార్లు ప్రయత్నించినా నో రెస్పాన్స్.. అసలేం జరిగిందో తెలిసి..

 • Share this:
  ఆన్ లైన్ మోసాలు చాలా విచిత్రంగా ఉంటాయి. బయట చదివేవాళ్లకేమో ఇంత సిల్లీగా ఎలా మోసపోయారబ్బా అనిపిస్తుంటుంది. కానీ మోసపోయిన వారేమో అవతలి వారు ఏం చెప్పినా నమ్మే స్థితిలో ఉంటారు. ‘నాకు అమ్మానాన్నలు లేరు, కష్టపడి పైకొచ్చా. కోట్ల కొద్దీ ఆస్తిని కూడగట్టుకున్నా. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మీరు నాకు బాగా నచ్చారు. మనం పెళ్లి చేసుకుందామా?‘ అని అతి తెలివిగా నెట్టింటి చోరులు అడుగుతుంటారు. గిఫ్ట్ బాక్సుల పేరుతో మోసపుచ్చుతారు. బాగా కావాల్సిన వారికి ఎమర్జెన్సీ ఆపరేషన్ అని కల్లబొల్లి కబుర్లు చెబుతారు. అవన్నీ నమ్మి వాళ్లకు డబ్బులు కనుక పంపితే మోసపోవడం ఖాయం. తాజాగా అచ్చం అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో జరిగింది. ఆరు నెలలుగా ఓ యువకుడికి మాయమాటలు చెబతూ ఏకంగా 14 లక్షల రూపాయలను ఓ కిలాడీ లేడీ కొల్లగొట్టింది. పెళ్లి పేరుతో నాటకమాడింది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించింది. పెళ్లికి సరిగ్గా రెండ్రోజుల ముందు ఫోన్ ను స్విచాఫ్ చేసింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం..

  హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో ఉండే అర్జున్ అనే యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటాడు. హెల్త్ టిప్స్ గురించి వీడియోలు తయారు చేసి టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటాడు. అతడి ప్రొఫైల్ ను ఓ లుక్కేసిన సైబర్ కిలేడీ లేడీ గతేడాది ఏప్రిల్ నెలలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఘట్టమనేని వర్ణనా మల్లికార్జున్ పేరుతో తనను తాను పరిచయం చేసుకుంది. అలా వారిద్దరి పరిచయం సోషల్ మీడియా నుంచి ఫోన్ నెంబర్ల వరకు వెళ్లింది. వాట్సప్ లో ప్రతీరోజూ చాట్ చేసుకునేవారు. అందంగా తయారయి ఉన్నట్టుగా తన ఫొటోలను కూడా అర్జున్ కు పంపించేది. ’నాకు అమ్మానాన్నలు లేరు. చిన్నప్పుడే చనిపోయారు. మా అక్కయ్యే నన్ను, నా తమ్ముడిని చదివించింది. పెంచి ప్రయోజకులను చేసింది‘ అంటూ ఆమె చెప్పడంతో అర్జున్ కు ఆమెపట్ల జాలి కలిగింది.

  తాను కూడా డెంటిస్ట్ గా కేరళలో విద్యాభ్యాసం చేశాననీ, ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నానని ఆమె అర్జున్ కు వివరించింది. ఈ క్రమంలోనే ’మీరు మాట్లాడే తీరు. మీరుచేసే వీడియోలు, మీ ప్రొఫైల్ నచ్చింది. మనం పెళ్లి చేసుకుందామా. ఇలాగే ప్రజలకు వైద్య సేవలు చేద్దాం‘ అంటూ వర్ణణ చెప్పేసరికి అర్జున్ నిజమేనని నమ్మేశాడు. అతడు కూడా సరేనన్నాడు. అతడు పెళ్లికి ఓకే అన్నప్పటి నుంచి డబ్బును లాగే ప్రక్రియకు వర్ణణ తెరలేపింది. సోదరుడికి ల్యాప్ టాప్ అవసరం ఉందని చెప్తే కొనిచ్చాడు. సునీత్ అనే వ్యక్తిని ఆమె పంపిస్తే అతడికి ల్యాప్ టాప్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్ నెలలో తన సోదరుడికి కరోనా అని చెప్పింది. హైదరాబాద్ కు పంపుతున్నాననీ, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది.

  కొండాపూర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించాడు. అతడికి మొత్తం 4.60 లక్షల రూపాయల బిల్లు పడింది. ఆ తర్వాత వర్ణణ కోసం ఏకంగా లక్షన్నర రూపాయల విలువైన హారాన్ని కొని పంపించాడు. నవంబర్ లో పెళ్లి చేసుకుందామని వర్ణణ చెప్పడంతో అతడు పెళ్లి రోజు కోసం ఎదురుచూడసాగాడు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించి ఆమెకు డేట్ చెప్పాడు. ఈ క్రమంలోనే పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలని అడగడతో 25 రోజుల వ్యవధిలోనే 8లక్షల డబ్బు, బంగారు ఉంగరం, పంపించాడు. తీరా పెళ్లి డేట్ కు సరిగ్గా రెండ్రోజుల ముందు వర్ణణ ఫోన్ స్విచాఫ్ అయింది. ఆమెతో పాటు తనకు తరచుగా కాంటాక్ట్ లో ఉన్న సునీత్ అనే వ్యక్తి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది. అప్పటికి గానీ అర్జున్ కు తెలియలేదు, తాను మోసపోయానని. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: