Home /News /telangana /

Attempt to murder: ప్రాణం తీసిన భూ తగాదా.. అన్నపై తమ్ముడు కర్రతో దాడి..

Attempt to murder: ప్రాణం తీసిన భూ తగాదా.. అన్నపై తమ్ముడు కర్రతో దాడి..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Attempt to murder: అన్నదమ్ముల మధ్య భూ తగాదా ఒకరి ప్రాణాన్ని తీసుకుంది. సొంత అన్నను కర్రతో కొట్టి చంపేశాడు. అడ్డొచ్చిన తండ్రికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

    బంధాలు, బంధుత్వాలు అనేవి ఆర్థిక పరమైన గొడవలు వచ్చినప్పుడు ఇవన్ని ఏమి గుర్తుకురావు. రక్తసంబంధికులు అనే బంధం ఏమాత్రం తెలియదు. తమకు దక్కాలనే దురాశతో వెళ్లడంతో క్షణికావేశంలో అనార్థాలు చోటుచుసుకుంటున్నాయి. చివరకు నేరాలు చేసి జైలు పాలవుతున్నారు. వారు బలయిపోవడమే కాక వారిని నమ్ముకొని ఉన్న కుటుంబసభ్యులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఓ అన్నదమ్ముల్ల మధ్య భూ తగాదా ఒకరి ప్రాణం పోయే దాకా వచ్చింది. భూమి విషయంతో ఆ భూమి తనకే చెందుతుందంటూ ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పక్కనే ఉన్న కర్రతో తన అన్న తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్త స్రావం అయింది. రక్తం అధికంగా పోవడంతో అతడు అక్కడిక్కడే కుప్పకూలాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన హన్మాండ్లుకు ఇద్దరు భార్యలు. వారిలో ఒక కుమారుడు జుట్టు శ్రీను (35), మరో భార్య కుమారుడు నరేందర్‌ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు.

    కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి జుట్టు శ్రీను ఈ మధ్య నే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతడు విదేశాలకు వెళ్లకముందే భూమి విషయంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ఓ రోజు శ్రీను తమ్ముడు నరేందర్ వద్దకు వచ్చి భూమి విషయంతో వాటాల గురించి మాట్లాడారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఈ ఘర్షణ ఒకరిపై ఒకరు కొట్టుకునే దాక వెళ్లింది. నరేందర్ అక్కడే ఉన్న కర్రతో అన్న శ్రీనుపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన తండ్రిపై కూడా కర్రతో దాడి చేయగా అతనికి గాయాలయ్యాయి. తనపై కర్రతో దాడి చేయగా నరేందర్ కోపంతో ఊగిపోతూ తన అన్న శ్రీను చేతిలో కర్రను లాక్కున్నాడు.

    క్షణికావేశంతో ఒక్కసారిగా నరేందర్ శ్రీను తలపై గట్టిగా కర్రతో కొట్టాడు. తల పగిలి తీవ్రంగా రక్త స్రావం అయింది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. దీనిపై దర్యప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Brother died, Brother kills, Crime, Crime news, Died, Nizamabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు