Medak: స్మార్ట్ ఫోన్ అన్నాడు.. తీరా విప్పి చూస్తే.. పోస్ట్‌మ్యాన్‌తో గొడవ..

Medak: స్మార్ట్ ఫోన్ అన్నాడు.. తీరా విప్పి చూస్తే.. పోస్ట్‌మ్యాన్‌తో గొడవ..

Medak : సైబర్ నేరగాళ్లు పట్టణాలను వదిలి పల్లెల్లో పడుతున్నారు. పట్టణాల్లో పోలీసుల బెడద ఎక్కువగా ఉండడంతో వారి దృష్టి పల్లెటూళ్లలో ఉన్నవారికి గాలం వేస్తున్నారు. ఇలా ఓ పల్లెటూర్‌కు చెందిన వ్యక్తికి స్మార్ట్ ఫోన్ పేరుతో స్వీట్ బాక్స్ పంపించి మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.

  • Share this:
    News 18 ప్రతినిధి
    కె.వీరన్న
    మెదక్ జిల్లా

    సైబర్ నేరగాళ్లకు (cyber crime)మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గిప్టులు, ఉద్యోగాలతోపాటు మ్యాట్రిమోనియల్ సంబంధాల పేరుతో అనేక మోసాలకు తెర తీస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ల కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇటివల పట్టణాల్లో చదువుకున్న వాళ్లే అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

    అయితే తాజాగా సైబర్ నేరగాళ్లు పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా గాలం వేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ కోనుగోళ్ల (online) తర్వాత ఈ నేరాలు అధికమయ్యాయి. పల్లెలను కూడా గిప్టుల పేరుతో మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీకు స్మార్ట్ గిప్టుగా వచ్చిందంటూ ఓ వ్యక్తి ఫోన్ (phone call ) చేసి మరి ఫోన్ పేరుతో ఓ పార్శిల్‌ను పంపారు..అయితే డబ్బులు చెల్లించిన తర్వాత ప్యాక్ విప్పి చూస్తే వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు.

    ఇది చదవండి : అక్క కేసులో విచారణకు వెళ్లి.. చెల్లెలితో సంబంధం.. పెట్టుకున్న కానిస్టేబుల్


    ఈ ఘటన మెదక్ (medak) జిల్లా నర్సపుర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో యాదయ్య అనే వ్యక్తికి గత వారం రోజుల క్రితం బెంగుళూరు నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది . యాదయ్య కు ఫోన్ చేసి 16 వేల రూపాయల ఫోన్ 1600 వందలకే వస్తుందంటూ చెప్పారు. వాటిని కూడా గిఫ్టు వచ్చిన తర్వాత చెల్లించాలని నమ్మించారు.. ముందు చెల్లించినా పర్వాలేదని చెప్పారు. అయితే గిఫ్టు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లిస్తానని యాదయ్య చెప్పడంతో పోస్ట్ ద్వారా పంపిస్తామని చెప్పారు... ఆ తర్వాత అడ్రస్ తీసుకుని ఓ ప్యాకెట్‌ను పంపారు. దీంతో నిన్న పోస్ట్ మాన్ యాదయ్య ఇంటికి వచ్చి మీకు గిఫ్ట్ ప్యాక్ (gift pack ) వచ్చిందని చెప్పాడు. దీంతో ఎగిరి గంతేసిన యాదయ్య పోస్టుమెన్‌కు డబ్బులతో పాటు పోస్టల్ చార్జీలు కూడా చెల్లించాడు.

    ఇది చదవండి : గ్రేట్ సీఎం.. అర్థరాత్రి పూట పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు... !


    అయితే డబ్బులు చెల్లించే ముందే యాదయ్యకు అనుమానం కూడా కల్గింది. దీంతో పోస్ట్‌మెన్‌తో (post man) చెప్పాడు. గిఫ్ట్‌ ఉంటేనే డబ్బులు ( money ) ఇస్తానని చెప్పాడు. కాని పోస్ట్ మ్యాన్ ఒప్పుకోలేదు. డబ్బులు చెల్లిస్తేనే గిఫ్టు ప్యాక్ ఇస్తానని చెప్పాడు. లేదంటే వాపసు పంపిస్తానని చెప్పాడు. దీంతో విలువైన స్మార్ట్ ఫోన్‌ (smart phone ) అదికూడా ఇంటిదగ్గరికి వచ్చిన దాన్ని ఎందుకు వదలాలనే అత్యాశతో యాదయ్య పోస్టుమెన్‌కు డబ్బులు చెల్లించాడు.

    అయితే పోస్ట్‌మెన్ ముందే ప్యాక్‌ను ఓపెన్ చేసి(open ) చూశాడు. దీంతో యాదయ్య ఖంగు తిన్నాడు. స్మార్ట్ ఫోన్‌కు బదులు ఓ స్వీట్ బాక్స్ (sweet box ) తోపాటు రోల్డ్‌గోల్డ్ చైన్‌ కనిపించింది. దీంతో యాదయ్య గిఫ్టు తెచ్చిన పోస్టు‌మ్యాన్‌తో వాగ్వావాదానికి దిగాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే కుదరని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్న యాదయ్య డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
    Published by:yveerash yveerash
    First published: