కూతురి పెళ్లిలో మాజీ సర్పంచ్ విందు ఐడియా అదుర్స్...

ప్రతీకాత్మక చిత్రం

కుమార్తె పెళ్లికి విందు భోజనాలకు గ్రామస్తులను అందరినీ పిలవలేకపోయాడు. అయితే, ఇంటింటికీ విందుకు సరిపడా సరుకులు ఇచ్చాడు.

  • Share this:
    పిల్లల పెళ్ళంటే ఉన్నదాంట్లో ఘనంగా జరిపి అయిన వారందరికి విందు భోజనాలు పెట్టాలన్నది తల్లిదండ్రుల కల. కానీ మాయదారి కరోనా ఓ దంపతులకు ఆ అవకాశం లేకుండా చేసింది. అయినా ఆ దంపతులు విందుకు అవసరమైన సరుకులను ఇంటింటికి పంచి తన కూతురి పెళ్లి సాదాసీదాగా ఇంట్లోనే జరిపించాడు. కరోనా లాక్ డౌన్ వేళ నిబంధనలను తప్పకుండా జరిగిన ఈ పెళ్లి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ తాంసి గ్రామానికి చెందిన మాజి సర్పంచ్ బేబీ తాయి రవిందర్ దంపతుల కూతురు సుజాత పెళ్లి కపిల్ తో నిశ్చయమైంది. గురువారం పెళ్లి. కానీ కరోనా వల్ల హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఇంటి దగ్గరే చేయాల్సి వచ్చింది. పెళ్లి కి 50 మంది కంటే ఎక్కువ హాజరవకూడదనే నిబంధన కారణంగా పెళ్లికి ఊర్లో వారిని ఎవరిని ఆహ్వానించలేదు. సామూహిక భోజనాలకు అనుమతి లేకపోవడంతో పెళ్లి విందుకు అవసరమైన అన్ని సరుకులను కూతురితో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పంచిపెట్టారు. ఎవరి ఇంట్లో వారే వండుకొని విందు ఆరగించాలని, తమ కూతురు అల్లుడిని ఇంటి నుంచే దీవించాలని కోరాడు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకుండా సాదాసీదాగా తన కూతురి పెళ్లి జరిపి ఆదర్శంగా నిలిచిన రవిందర్ దంపతులను అందరు అభినందిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: