శంషాబాద్ విమానాశ్రయంలో విషవాయువు పీల్చి ఒకరు మృతిచెందారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో డ్రైనేజీ పైప్ లైన్ లీకైంది. దీంతో పైప్ లైన్ లీకేజీ సరిచేసే పనిని అక్కడి సిబ్బందికి అప్పజెప్పారు. సిందూరి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న నర్సింహారెడ్డి, మరో ఇద్దరు లీకేజీని సరిచేసేందుకు ప్రయత్నించారు. డ్రైనేజీ లీకేజీల కోసం తనిఖీలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో పైకప్పుకు ఎక్కి, నాళాలను క్లియర్ చేయడానికి.. పైపులో యాసిడ్ పోశారు. ఇలా చేయడంతో.. ఒక్కసారిగా ఘాటైన విషవాయువులతో పాటుగా, పొగలు వచ్చాయి. ఘాటైన పొగ పీల్చి నర్సింహారెడ్డి అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో అధికారులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి మృతిచెందాడు. నర్సింహారెడ్డితో పనులు చేపట్టిన జాకీర్, ఇలియాస్ క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shamshabad Airport, Telangana