హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: వైన్ షాపులో కల్తీ మద్యం .. తాగి చనిపోయినా పట్టించుకునేవారేరి..?

OMG: వైన్ షాపులో కల్తీ మద్యం .. తాగి చనిపోయినా పట్టించుకునేవారేరి..?

SANGREDDY

SANGREDDY

Telangana: కల్తీ మద్యం మరొకర్ని కాటేసింది. వైన్స్‌ షాపులో తాగిన మద్యానికి ఓ మందుబాబు ప్రాణాలు విడిచాడని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణం ఎక్కడ జరిగిందంటే.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

తెలంగాణ(Telangana)లో కల్తీ మద్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో వైన్ షాపు పర్మిట్‌ రూమ్‌లోనే మద్యం తాగిన వ్యక్తి ప్రాణాలు విడిచిపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన 24గంటలకు ఈ వార్త బయటకు రావడంపై స్థానికులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి (Vatpalli) మండలం మరవెళ్లిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. శివశంకర్‌ (Shivashankar)అనే 45ఏళ్ల వ్యక్తి శుక్రవారం లక్ష్మీనరసింహ వైన్స్‌ (Lakshminarasimha Wines)లో మద్యం తాగాడు. వైన్స్‌కి చెందిన పర్మిట్ రూమ్‌లోనే రాత్రి ప్రాణాలు విడిచిపెట్టడంతో స్ధానికులు ఎక్సైజ్‌ అధికారుల(Excise officials)కు సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారులు స్పందిచకపోవడం, వైన్ షాపు యజమానిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కల్తీ మద్యానికి ఒకరు బలి..

సంగారెడ్డి జిల్లాలోని కొన్ని మద్యం షాపుల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. వట్పల్లి మండలం మరవెళ్లిలోని లక్ష్మీనరసింహ వైన్స్‌ పర్మిట్‌ రూమ్‌లో శివశంకర్‌ అనే వ్యక్తి మద్యం తాగి రాత్రి చనిపోయాడు. స్థానికులకు ఈ విషయం తెలిసి వెంటనే ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వైన్స్ నిర్వాహకుడు శంకర్‌గౌడ్‌ కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు. వైన్స్‌కి చెందిన పర్మిట్ రూమ్‌లో మద్యం తాగిన వ్యక్తి చనిపోయాడని ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు శవాన్ని పరిశీలించడం, షాపు ఓనర్‌పై చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చర్యలేవి సార్ ..

శుక్రవారం రాత్రి నుంచి మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన శివశంకర్ మృతదేహం పడి ఉందని..ఎందుకని చర్యలు తీసుకోవడం లేదని..మద్యం షాపులో పడి ఉన్న మృతదేహాన్ని ఎందుకు పరిశీలించలేదని ..ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Sangareddy, Telangana News

ఉత్తమ కథలు