యాక్సిడెంట్ చేశానన్న మనస్తాపంతో వ్యాపారి సూసైడ్...

తన వల్లే ప్రమాదం జరిగిందని మోహన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఒక వ్యక్తి మరణానికి తాను కారణమయ్యానన్న మనస్థాపంతో సాయంత్రం భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి మరణించాడు.

news18-telugu
Updated: August 14, 2019, 7:30 PM IST
యాక్సిడెంట్ చేశానన్న మనస్తాపంతో వ్యాపారి సూసైడ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం కూకట్‌పల్లిలోని కాలనీలో ఓ వ్యాపారి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యానన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. కూకట్ పల్లికి చెందిన మోహన్ బుధవారం ఉదయం తన మిత్రులో కలిసి పటాన్‌చెరులోని గుడికి దైవదర్శనం చేసుకున్నాడు. అనంతరం తిరిగి కూకట్‌పల్లికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బైక్ ఉన్న వ్యక్తి చనిపోయాడు. తన వల్లే ప్రమాదం జరిగిందని మోహన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఒక వ్యక్తి మరణానికి తాను కారణమయ్యానన్న మనస్థాపంతో సాయంత్రం భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి మరణించాడు.
First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు