MAN COMMITS SUICIDE DUE TO FINANCIAL HARASSMENT VRY
Hyderabad : ఫైనాన్స్ ఆగడాలు... మోపెడ్ తీసుకు వెళ్లారని ఓ వ్యక్తి ఆత్మహత్య...?
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad : ఫైనాన్స్ లో చిన్న మోపెడ్ తీసుకున్న ఓ చిరు వ్యాపారీ ఈఎమ్ఐలు కట్టకపోవడంతో టూవీలర్‌ను తీసుకువెళ్లారు.. దీంతో అనుమానం తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు ఆ చిరువ్యాపారి.
కరోనా కష్టకాలం, దీనికి తోడు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు .. వేల రూపాయల నుండి కోట్ల రూపాయల వ్యాపారం చేసే వారి ప్రాణాలు తీసుకుంటున్నాయి.. కనీస ధర్మం పాటించకుండా డబ్బులు తీసుకోవడమే పరమావధిగా కొనసాగుతున్న ఫైనాన్స్ వ్యాపారులు ఆగడాలు నిత్యాకృత్యం అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఖమ్మంలో ఓ కుటుంబం, నల్గొండలో ఓ కుటుంబం పిల్లలతో పాటుగా చిన్నా పెద్దా అందరు వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటీ సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నా.. గట్టిగా ధైర్యంగా నిలబడే వారు ప్రాణాలు నిలబెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. కాని కొంతమంది మాత్రం అప్పుల బాధకు ప్రాణాలు వదలడమే శరణ్యంగా భావిస్తున్నారు. దీంతో ఫైనాన్స్ ఆగడాలకు ఎదురు లేకుండా పోతుంది. ఇలా తాజాగా ఓ చిరు వ్యాపారీ సైతం అవమానాలు భరించలేక ప్రాణాలు వదిలిన సంఘటన హైదరాబాద్ నగరంలోని దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాకు చెందిన గోపీ నారాయణ్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు సాయి చరణ్, కుమార్తె శ్రుతి ఉన్నారు. వీరు బతుకు దెరుకు కోసం జిల్లాను వదలి హైదరాబాద్ నగరంలోని భౌరంపేట్‌లో నివాసం ఉంటున్నారు. గోపీ నారాయణ్ ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో నాటుకోళ్ల ఫారంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మరోవైపు ఇంటివద్దే నాటు కోళ్ల వ్యాపారం చేస్తూ.. మూడు నెలల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో టీవీఎస్ మోపెడ్ కొనుగోలు చేశాడు. కరోనా కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో వాయిదాలు చెల్లించలేక పోయాడు. దీంతో వ్యాపారులు మంగళవారం వాహనాన్ని బలవంతంగా లాక్కుని పోయారు.
దీంతో అవమానం భరించలేక మనస్తాపానికి గురైన నారాయణ్ అదే రోజు సాయంత్రం కుమారుడికి ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి గండిమైసమ్మ చౌరస్తా నుంచి బస్సులో మల్లంపేట్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లి మరోసారి కుమారుడికి ఫోన్‌చేసి చెరువులో దూకి చస్తున్నానని చెప్పాడు. దీంతో కుమారుడు వారించాడు ..తాను లేకుండా మేము ఉండలేమని వేడుకున్నాడు.. అనంతరం అక్కడికి వెళ్లి తండ్రిని తీసుకుని మల్లంపేట్‌లో ఉన్న బంధువుల ఇంటికి ఆ రాత్రి తీసుకెళ్లాడు. అయితే నారయణ్ కు మాత్రం నిద్ర పట్టలేదు.. తాను పడిన అవమానాలు గుర్తుకు వచ్చాయి.. దీంతో ఆ రోజు రాత్రి బంధువుల ఇంట్లో ఉన్న గోపీనారాయణ్ రెండో రోజు 9.30 ప్రాంతంలో భౌరంపేట్‌లోని ఆర్కే టౌన్‌షి్‌పలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. అయితే ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులే కారణమా లేక ఇతర కుటుంబపరమైన కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.