Home /News /telangana /

MAN COMMITS SUICIDE ATTEMPT AT ADILABAD MLA CAMP OFFICE SNR ADB

Adilabad: నా ఇల్లు కాజేయాలని చూస్తున్నారు..ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లోనే ఆత్మహత్యాయత్నం

(ఆత్మహత్యాయత్నం)

(ఆత్మహత్యాయత్నం)

Adilabad:అదిలాబాద్‌లో అధికార పార్టీ నేతల ఆగడాలు భరించలేక ఓ వ్యక్తి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. తనకున్న ఇంటిని కబ్జా చేయడానికి కొందరు కన్నేశారని..ఎలాగైనా వాళ్ల నుంచి తన ఇంటిని కాపాడమని వేడుకునేందుకు వచ్చి పెట్రోల్‌ ఒంటిపై పోసుకున్నాడు. అక్కడున్నవాళ్లు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    ఖమ్మం (Khammam)జిల్లాలో అధికార పార్టీ నేతల వేధింపులతో ఓ సాయిగణేష్‌(Saiganesh)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ప్రజలు మరిచిపోకముందే సరిగ్గా అలాంటి ఘటననే మరొకటి ఆదిలాబాద్(Adilabad)జిల్లా కేంద్రంలో జరిగింది. అయితే స్థానికులు తేరుకొని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్(Ramnagar)కు చెందిన ఆవుల సంతోష్ (Avula Santosh)అనే యువకుడు పట్టణంలోని 170 సర్వే నెంబర్(Survey No)లో ఇల్లు కట్టుకున్నాడు. వికలాంగురాలైన తన తల్లికి అప్పటి కాంగ్రెస్Congress ప్రభుత్వం ఈ స్థలాన్ని ఇచ్చింది. డ్రైవర్(Driver) గా పనిచేస్తున్న ఆ యువకుడు కొంత డబ్బును పోగుచేసుకొని తన తల్లికి ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఆ స్థలం మీద కొందరు టిఆర్ఎస్(TRS) పార్టీకి చెందిన నాయకులు కన్నేశారని ఆ స్థలాన్ని , ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నస్తున్నారనేది బాధితుడి ఆరోపణ.

    మరో సాయిగణేష్..
    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అధికార పార్టీ శాసనసభ్యుడి కార్యాలయంలో వచ్చాడు సంతోష్. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోని కౌన్సిలర్లు, టిఆర్ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. చేతిలో పెట్రోల్‌ బాటిల్‌ లాక్కొని నీళ్లు చల్లారు. ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

    నిరుపేదలపైనే నేతల కళ్లు..
    ఇంటితో పాటు స్తలం సొంతం చేసుకోవాలన్న దుర్భుద్దితో ఇంట్లోలేని సమయంలో తన భార్య పిల్లలను ఇంటి నుండి గెంటేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేక మానసికంగా ఒత్తిడికి గురయ్యానని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సంతోష్ తెలిపాడు. అప్పులు చేసి కట్టుకున్న ఇంటిని కూడా అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన దయాకర్, నవీన్, కార్తీక్‌తో పాటు మరికొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని అధికార పార్టీ నేతలు కాజేయాలని చూస్తున్న ఇంటి విషయంలో చర్చించేందుకే ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చానని స్పష్టం చేశాడు.

    అధికారమే పరమావధిగా దోపిడీ..
    ఎమ్మెల్యేతో, మున్సిపల్ చైర్మన్‌తో గాని తనకు ఎలాంటి వివాదాలు లేవని బాధితుడు తెలిపాడు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు జిల్లాలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూముల ఆక్రమించుకోవడం, కబ్జాల  విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆ ఆరోపణలకు బలాన్నిచేకూర్చినట్లైంది. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు తమ కబ్జాల పర్వానికి తెర దింపుతారో లేక కొనసాగిస్తారో చూడాలి.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Attempt to suicide, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు