Home /News /telangana /

MAN CHEATED WOMEN IN INSTAGRAM AS GIRL VRY

Social Media fraud : అమ్మాయిగా మారిన అజయ్... నగ్న చిత్రాల కోసం..డిమాండ్...

Social Media fraud

Social Media fraud

Social media fraud : సోషల్ మీడియాలో అమ్మాయిల మారి ఇతర అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువకున్ని నగరల్ పోలీలసులు అరెస్ట్ చేశారు..

    అమ్మాయి పేరుతో సోషల్ మీడియాలో ప్రోఫైల్ క్రియోట్ చేసిన ఓ యువకుడా అమ్మాయిల ఫోటోలను తీసుకోని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. కోరిక తీర్చకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

    చేతిలో టెక్నాలజీ ఉన్న ఓ వ్యక్తి తన టెక్నాలజీని మోసాలు చేసేందుకు ఉపయోగించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిగా తన ప్రోఫైల్ క్రియెట్ చేసి తోటి మహిళలను చీట్ చేశాడు. మహిళగా నమ్మించి వారితో చాటింగ్ చేశాడు. ఆతర్వాత వారితో ఆన్‌లైన్ ఫ్రెండ్ చేశాడు.. అమ్మాయిలు క్లోజ్ అయిన తర్వాత వారి ఫోటోలు కావాలని అడిగే వాడు.. ఇచ్చిన తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపించాడు.. ఇలా అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ చీటర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

    Hyderabad : దారుణం.. సహజీవనం వద్దని వెళ్లిన మహిళ సజీవదహానం.. ?


    వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పరకాలకు చెందిన అజయ్ అనే యువకుడు హైదరాబాద్‌లో మల్టీమీడియాలో వర్క్‌ చేస్తున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా అమ్మాయిలా మారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రోఫైల్ క్రియోట్ చేశాడు.. అందులో చాటింగ్‌కు వచ్చిన వారితో క్లోజ్‌గా మారి వారి ఫోటోలను తీసుకునేవాడు. ఆతర్వాత ఫోటోలను అడ్డం పెట్టుకుని తన కొరిక తీర్చాలని డిమాండ్ చేశాడు.. ఒకవేళ వినకపోతే వారు పంపిన ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.. ఇలా చాల మంది అమ్మాయిలను బెదిరింపులకు గురి చేసిన అజయ్ పై పదిహేను రోజుల క్రితం ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దీంతో రంగంలో దిగిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేడు దిల్‌సుఖ్‌నగర్‌ ఉన్న అజయ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు