Hyderabad: అమెరికా నుంచి తిరిగొచ్చి షాకింగ్ విషయాన్ని చెప్పిన అక్క.. కంగుతిన్న చెల్లి.. అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో ఉండే ఓ మహిళ హైదరాబాద్ లోని తన చెల్లి ఇంటికి వచ్చింది. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆ అక్కాచెల్లెల్లిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఓ విషయం గురించి తన చెల్లిని అడిగింది. ఆ తర్వాత అక్క చెప్పిన నిజాన్ని విని..

  • Share this:
    అమెరికాలో ఉండే ఓ మహిళ హైదరాబాద్ లోని తన చెల్లి ఇంటికి వచ్చింది. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆ అక్కాచెల్లెల్లిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి తాను అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో పంపిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టావని ఆ అక్క అడిగింది. నేనేం ఖర్చు పెట్టలేదని ఆ చెల్లి సమాధానమిచ్చింది. కానీ ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాత్రం మాయం అయ్యాయి. అమెరికా నుంచి ఆ అక్క తన చెల్లికి పంపించిన డబ్బు అకౌంట్లో లేదు. ఎవరో విత్ డ్రా చేశారు. చెల్లేమో తనకు తెలియదంటోంది. దీంతో ఆ అక్క హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడితే ఆ ఇంట్లో పనిచేసి మానేసిన ఓ వంటవాడి బండారం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలో ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె అక్క అమెరికాలో ఉద్యోగం చేస్తుంటుంది. అప్పుడప్పుడు తన చెల్లి బ్యాంకు ఖాతాలోకి ఆ అక్క డబ్బులు వేస్తుంటుంది. ఆ విషయం ఫోన్ చేసి కూడా చెబుతుంది. ఆమె తన ఏటీఎం డెబిట్ కార్డు కవర్ పై పిన్ నెంబర్ ను రాసుకుని టేబుల్ పై ఉంచుకుంటుంటుంది. ఆ ఇంట్లో కొన్నాళ్ల క్రితం ప్రకాశం జిల్లా నూతనపాడు మంగనూర్ గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వంటవాడిగా చేరాడు. అమెరికా నుంచి ఆమె అక్క డబ్బులు పంపించే విషయాన్ని అతడు గ్రహించాడు. ఏటీఎం కార్డు కూడా ఎప్పుడూ టేబుల్ పై ఉండటాన్ని చూశాడు.

    ULIP, Union Budget, Taxation, Budget, Budget 2021, Union Budget 2021, Finance యులిప్, పన్ను, కేంద్ర బడ్జెట్
    ప్రతీకాత్మకచిత్రం

    ఇది కూడా చదవండి: భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఆమె బాత్రూంలోకి వెళ్లడం చూసిన భర్త.. ఆమె వెనుకే వెళ్లి..

    అంతే కాకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినా, ఎవరైనా డిపాజిట్ చేసినా ఆమె మొబైల్ కు మెసేజ్ లు రాకపోవడాన్ని లక్ష్మీనారాయణ ఆసరాగా చేసుకున్నాడు. 2020 జనవరి నుంచి పలుమార్లు ఏటీఎంను దొంగిలించి డబ్బులు విత్ డ్రా చేశాడు. అలా మొత్తం మీద ఆమె ఏటీఎం నుంచి 2లక్షల 70వేల రూపాయల వరకు డబ్బును విత్ డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే ఇతర కారణాలు చెప్పి ఆ ఇంట్లో పని మానేశాడు. బెంగళూరు వెళ్లి విలాసవంతంగా గడుపుతున్నాడు. అయితే ఆ మహిళ అక్కయ్య అమెరికా నుంచి రావడం, డబ్బుల గురించి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. డబ్బుల మాయం గురించి రాచకొండ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేయగా, లక్ష్మీనారాయణ నిర్వాకం గురించి తెలిసింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
    ఇది కూడా చదవండి: పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడేళ్లకే ఘోరం.. పదో అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..
    Published by:Hasaan Kandula
    First published: