హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mallareddy: మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన టీఆర్ఎస్..! ఎవరూ ఊహించని విధంగా..

Mallareddy: మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన టీఆర్ఎస్..! ఎవరూ ఊహించని విధంగా..

మల్లారెడ్డి (ఫైల్ ఫొటో)

మల్లారెడ్డి (ఫైల్ ఫొటో)

MallaReddy: మల్లారెడ్డిపై జరిగిన దాటి ఘటనపై టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా రెడ్డి సామాాజిక వర్గానికి చెందిన నేతలు కూడా మాట్లాడకపోవడం.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

తెలంగాణ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)నే హాట్ టాపిక్. మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ (Mallareddy Vs Revanth Reddy).. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రెడ్ల సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడిజరగడం తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటన వెనక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారని.. తన హత్యకు కుట్ర పన్నారని స్వయంగా మల్లారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిమరీ ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత.. ఈ ఇష్యూ చాలా పెద్దదవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సైలెంట్ అయిపోయింది. మల్లారెడ్డిపై జరిగిన దాటి ఘటనపై టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా రెడ్డి సామాాజిక వర్గానికి చెందిన నేతలు కూడా మాట్లాడకపోవడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Telangana: గ్రామాలకు శుభవార్త.. సీఎం కేసీఆర్ మరో సంచలనం.. ఆ కష్టాలు తీరినట్లే

మే 29న హైదరాబాద్ శివారులోని ఘట్​కేసర్​లో రెడ్ల సింహగర్జన సభ జరిగిన విషయం తెలిసిందే. ఆ సభలో మాట్లాడిన మల్లారెడ్డి.. రెడ్ల గురించి కాకుండా.. పదే పదే సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడంపై .. సభకు హాజరైన కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్​ ఏర్పాటు చేయించలేకపోయారని నిలదీశారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, స్టేజి దిగి వెళ్లిపోయారు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆయన కారుపై కుర్చీలు, రాళ్లు, వాటర్ బాటిళ్లను విసిరారు. సీఎం కేసీఆర్, మంత్రులపై సోషల్ మీడియాలో కామెంట్ చేసినా సీరియస్‌గా తీసుకునే ప్రభుత్వం.. మంత్రిపై బహిరంగంగా ఇంత దాడి జరిగినా సైలెంట్‌గా ఉంది.

సాధారణంగా టీఆర్ఎస్ నేతలు, మంత్రులపై ప్రత్యర్థి పార్టీల నేతలెవరైనా విమర్శలు గుప్పిస్తే.. టీఆర్ఎస్ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తుంది. గంటల వ్యవధిలోనే గులాబీ నేతలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు నిర్వహించి ఎదురుదాడికి దిగుతారు. కానీ అనూహ్యంగా.. మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై మాత్రం ఎవరూ స్పందించలేదు.

ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మాత్రమే ఈ వ్యవహారంపై స్పందించారు. అది కూడా మొక్కుబడిగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి టీఆర్ఎస్ నేత మాత్రమే కాదు.. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అంత పెద్ద పదవిలో ఉన్న నేతపై పబ్లిగ్గా దాడి జరిగితే.. అది చాలా సీరియస్ మ్యాటర్..! కానీ మల్లారెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు.

సిరిసిల్లలో చెరువునే మినీ ట్యాంక్​ బండ్​గా మార్చిన అధికారులు.. క్యూ కడుతున్న జనం

ఇంత జరిగినా పార్టీ స్పందించకపోవడం ఏంటని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. పార్టీలో మంత్రి మల్లారెడ్ది ఒంటరయ్యారని మదనపడుతున్నారట. పార్టీ తీరు పట్ల ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారట.

వీ6 వెలుగు కథనం ప్రకారం... రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి వ్యవహారం తర్వాత.. రెడ్ల కులస్తులు పార్టీకి దూరమవుతున్నారన్న సంకేతాలను సీఎం కేసీఆర్ పసిగట్టారని తెలుస్తోది. మళ్లీ దీనిపై స్పందిస్తే.. మరింత వ్యతిరేకత వచ్చే అవకాశముందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇందులో ఎవరూ కలగజేసుకోవద్దని ఆయన ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే మల్లారెడ్డి ఎపిసోడ్‌పై టీఆర్ఎస్ నేతలంతా సైలైంట్‌గా ఉన్నరని సమాచారం. ఏది ఏమైనా.. మల్లారెడ్డి విషయంలో పార్టీ తీరుపై మాత్రం.. ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మల్లారెడ్డిని ఒంటరిని చేశారని బాధపడుతున్నారట.

First published:

Tags: CM KCR, Malla Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు