హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mallannasagar : ప్రతిష్టాత్మక మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి... రేపే.. జాతికి అంకితం..

Mallannasagar : ప్రతిష్టాత్మక మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి... రేపే.. జాతికి అంకితం..

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు

Mallannasagar : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.అనేక వివాదాల మధ్య పూర్తి చేసుకున్న మల్లన్న సాగర్ రాష్ట్రంలోనే అతి పెద్ద జలాశయం సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

    తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు (ఈ నెల 23న) మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ మల్లన్న సాగరే అతి పెద్దది.. సిద్దిపేట జిల్లా తొగుట కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య జలాశయం ను నిర్మించారు . అత్యంత ఎత్తున నిర్మించిన జలాశయంగా మల్లన్నసాగర్ ప్రత్యేకతను సంతరించుకుంది. డ్యామ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న మల్లన్నసాగర్‌ ను ప్రారంభానికి అధికారులు సర్వ సన్నద్ధం చేసారు అత్యంత కీలకమైంది కూడా. మల్లన్నసాగర్‌ నిర్మాణం పూర్తి కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌ 4 లో నీ అన్ని పనులు పూర్తి అయ్యాయి.

    కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం తో వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు దీని నుంచి నీటిని అందిస్తారు. మరో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ-స్టేజ్‌ 1, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15,71,050 ఎకరాలు ఈ రిజర్వాయర్‌ కిందికి రానున్నాయి. రిజర్వాయర్‌ వైశాల్యం 17,600 ఎకరాలు కాగా, 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున ఐదు అంచెల్లో దీన్ని కట్టారు. 143 మీటర్ల పొడవుతో మత్తడిని ఏర్పాటుచేశారు.


    Telangana : ప్రియుడు వరంగల్‌లో ప్రియురాలు బిహర్‌లో.. ప్రియురాలు ఫోన్ లిప్టు చేయడం లేదని..

    మల్లన్న సాగర్ పరివాహక ప్రాంతం 75 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది.మిషన్ భగీరథ క్రింద 7 జిల్లాల పరిధిలో నీ 9 నియోజక వర్గాల కు త్రాగునీరు అందనుంది. తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి మల్లన్నసాగర్‌కు జలాశయానికి నీటిని తరలిస్తారు.

    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Telangana

    ఉత్తమ కథలు