హోమ్ /వార్తలు /తెలంగాణ /

WomensDay 2020 | మాలావత్ పూర్ణ... కష్టాల పర్వతాలను అధిరోహించిన వనిత...

WomensDay 2020 | మాలావత్ పూర్ణ... కష్టాల పర్వతాలను అధిరోహించిన వనిత...

మలావత్ పూర్ణ

మలావత్ పూర్ణ

International Womens Day | ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మలావత్ పూర్ణ జీవిత విశేషాలపై న్యూస్-18 మహిళా దినేత్సవ ప్రత్యేక కథనం.

    ఆడదంటే అబల కాదు సబల... ఆడదంటే ఆది పరాశాక్తి ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పుకుంటూ పోయినా ఆడ వారిపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందనేని వాస్తవం. ఎంత వివక్షకు గురైనా... ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో నేను సబలనే అని నిరూపించింది నిజామాబాద్ జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించిన మలావత్ పూర్ణ. పేదరికం పెను సవాలు విసిరినా... అవే సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కింది. 18 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోని ఆరు ఎత్తైన శిఖరాలను అధిరోహించి ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం పూర్ణ ప్రపంచంలోని ప్రతి పర్వతారోహకుడి కలగా భావించే ఉత్తర అమెరికాలోని ఎత్తైన డెనాలి శిఖరాన్ని కూడా అధిరోహిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోనే ఉంది. డెనాలీ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహిస్తే పూర్ణ ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వాతాలు అధిరోహించిన ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మలావత్ పూర్ణ జీవిత విశేషాలపై న్యూస్-18 మహిళా దినేత్సవ ప్రత్యేక కథనం.

    పర్వతారోహణలో మాలావత్ పూర్ణ

    పూర్ణ ఇటీవలే అంటార్కిటికా ఖండంలోని అత్యంత ఎత్తైన విన్సన్ మాసిఫ్ పర్వత శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. 16,050 అడుగుల ఎత్తు గల ఈ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలలో ఒకటి. డిసెంబర్ 26, 2019న మలావత్ పూర్ణ ఈ ఘనత సాధించింది. విస్సన్ మాసిఫ్ అధిరోహణతో ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.

    అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ పర్వతారోహణలో మాలావత్ పూర్ణ

    తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన పాకాలకు చెందిన మలావత్ పూర్ణ చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి గ్రామంలో ఉండే చిన్నచిన్న కొండలు, గుట్టలు ఎక్కుతూ ఆడుకోవడం అంటే చాలా సరదా. అయితే... ఆమె తల్లిదండ్రులు మాత్రం “ఏమిటా ఆటలు... మగ రాయుడిలా గుట్టలెక్కడం ఏమిటి?” అని నిరుత్సాహపరచే వారు. అయినా తన సరాదా కోసం తల్లిందండ్రుల కళ్లుగప్పి గుట్టలెక్కేదని ఆమె బాల్య స్నేహితులు చెబుతుంటారు. అలా ప్రారంభమైన పూర్ణ ప్రస్థానం ప్రపంచ ఖ్యాతి సాధించే స్థాయికి సాగింది.

    ప్రధాని నరేంద్ర మోదీతో మాలావత్ పూర్ణ

    పూర్ణ ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా) 2014లో అధిరోహించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019) మౌంట్ కార్ట్స్నెజ్ (ఓషియానియా ప్రాంతం, 2019) మరియు మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) శిఖరాలను వరుసగా జయించింది.

    మాలావత్ పూర్ణకు రూ.25లక్షల చెక్ అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్

    మలావత్ పూర్ణ తల్లిదండ్రులు లక్ష్మి, కొండల రావు. వీరు సాధారణ వ్యవసాయ కుంటుంబానికి చెందిన వారు. కుమార్తెను చదివించే స్థోమత కూడా లేదు. అయితే... పూర్ణ పదో తరగతి వరకు తాడ్వాయి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంది. ఇటర్మీడియేట్ విద్య కూడా ప్రభుత్వ గురుకుల కళాశాలలోనే సాగింది.

    మలావత్ పూర్ణ ప్రస్తుతం అమెరికాలోని మిన్నెసోటా స్టేట్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసిస్తోంది. జీవితంలోని అవాంతరాలన్నీ అధిగమించి ముందుకు సాగుతున్న మలావత్ పూర్ణ నేటి యువతరానికి ఆదర్శం.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Womens Day 2020

    ఉత్తమ కథలు