హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR : కంటోన్మెంట్‌ పై మరోసారి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. విలీనమే అంటున్న మంత్రి

KTR : కంటోన్మెంట్‌ పై మరోసారి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. విలీనమే అంటున్న మంత్రి

cantonment board

cantonment board

KTR : కంటోన్మెంట్(cantonment) విలీన అంశంపై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ (ktr)కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మెజార్టీ ప్ర‌జ‌లు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో(ghmc) విలీనం చేయాల‌ని కోరుకుంటున్నార‌ని కేటీఆర్ తెలిపారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ అంశంపై కేటీఆర్ చేసిన ట్వీట్‌కు భారి స్పంద‌న వచ్చిందని, 70 శాతం పైచిలుకు ప్ర‌జ‌లు క‌లిపితేనే బాగుంటుంద‌ని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారని ఆయన చెప్పారు.

ఇంకా చదవండి ...

నగరంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుపై(cantonment) మంత్రి కేటీఆర్ (ktr) గత కొద్ది రోజులుగా చర్చ పెట్టారు. బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు ఆ ప్రాంతంలో రాష్ట్ర అజమాయిషీ లేక పోవడం వల్ల అభివృద్ది కుంటుపడుతుందనే అభిప్రాయంలో ఉన్న మంత్రి కేటిఆర్ దాన్ని జీహెచ్‌ఎంసీలో(ghmc) వీలీనం చేయడమే పరిష్కారమని చెబుతున్నారు.

సోషల్ మీడియా వేదిక కంటోన్మెంట్ విలీనం

ఈ సంధర్బంగా కంటోన్మెంట్ విలీనంపై ప్రజల అభిప్రాయం తీసుకునేందుకు సోషల్ మీడియాను(social media) వేదికగా చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనంపై ఆయన ట్వీట్ చేశారు. దీంతో తన ట్వీట్‌పై(twitter) ప్రజలు ఎలా స్పందించారనే అంశాలను ఆయన మీడియాకు వివరించారు. పెద్ద ఎత్తున ప్రజలు తన ట్వీట్‌కు స్పందిచారని 70 శాతం ప్రజలు జీహెచ్‌ఎంసీలో విలీనడాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

ఇది చదవండి : మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. రెండు రోజుల పాటు మకాం.. !

అధికారుల ఇష్టారాజ్యం

ఈ సంధర్భంగా కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరుపై ఆయన మరోసారి ఎండగట్టారు.. కంటోన్మెంట్ ఏరియా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ( state government) అజ‌మాయిషీలో లేదుని, దీంతో స‌మ‌న్వ‌య స‌మ‌స్య త‌మ‌కే కాదు ప్ర‌జ‌ల‌కు కూడా ఉంద‌న్నారు. అధికారులు ఆ ప్రాంతంలో రోడ్లు మూసివేస్తూ.., ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని అన్నారు... ముఖ్యంగా హైద‌రాబాద్ నగరంలో గతంలో ఎక్కువ విస్తిర్ణయంలో పెర‌గ‌న‌ప్పుడు స‌మ‌స్య తీవ్ర‌త వేరుగా ఉండేదని .. కాని ఇప్పుడు కంటోన్మెంట్ చుట్టూ ల‌క్ష‌ల మంది ప్రజలు తమ నివాసాలు ఏర్పరచుకున్నారని అన్నారు.

 ఏ ప‌థ‌కాలు అమ‌లు కావు

ఈ క్రమంలోనే కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన టీఎస్ బీసాస్, అన్న‌పూర్ణ సెంట‌ర్లు అక్క‌డ అమ‌లు కావని చెప్పారు... న‌గ‌ర‌మంతా ఫ్లై ఓవ‌ర్లు, స్కైవేలు క‌డుతున్నామని, కాని ఆ ప్రాంతంలో క‌డుదామంటే మాత్రం అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. స్కేవేల నిర్మాణం కోసం ఏడేళ్ల నుంచి ప్ర‌య‌త్నం చేస్తున్నాం, కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డం లేదని చెప్పారు... ఈ అంశాన్ని రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌స్తావిస్తే.. కంటోన్మెంట్ అధికారులు స‌హ‌క‌రించ‌డం లేని చెప్పారు....

ఇది చదవండి :రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ


కంటోన్మెంట్ విలీనానికే మెజార్టీ ప్ర‌జ‌లు మొగ్గు

ముఖ్యంగా కంటోన్మెంట్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, వారి ల్యాండ్‌కు అనుగుణంగానే ఆ స‌మామైన ల్యాండ్ ఇస్తామ‌ని చెప్పినా కూడా ఒప్పుకోవ‌డం లేదు. దీంతో విచిత్ర‌మైన ప‌రిస్థితి కనిపిస్తోందని అన్నారు.. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 40 రోడ్లు మూసివేశారని చెప్పారు. కంటోన్మెంట్ విలీన అంశంపై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణకు సంబంధించి వార్త‌లు వ‌చ్చాయని దీంతో కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే మంచిద‌ని మెజార్టీ ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు పేర్కొన్నారు. దీనిపై ప్ర‌జ‌లు నిజంగా ఏమ‌నుకుంటున్నారో తెలుసుకునేందుకు తాను సోష‌ల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాల‌ను కోరాను. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో క‌లిపితేనే బాగుంటుంద‌ని 70 శాతం పైచిలుకు ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను చెప్పారని దీంతో ఈ అంశాన్ని దీనిపై సీఎం కేసీఆర్‌తో(cm kcr) పాటు స్థానిక ఎమ్మెల్యే, బోర్డు మెంబ‌ర్ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు

First published:

Tags: GHMC, Hyderabad, KTR

ఉత్తమ కథలు