హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పొగతో ఊపిరాడక స్థానికుల పరుగులు

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పొగతో ఊపిరాడక స్థానికుల పరుగులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అంతేకాదు సమీప కాలనీల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలతో ఊపిరాడక స్థానికులు పరుగులు పెట్టారు. దాంతో ముందు జాగ్రత్తగా గోదాం చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లలో ఉండే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు

దీపావళి వేళ హైదరాబాద్‌లో భారీ అగ్రిప్రమాదం జరిగింది. వనస్థలిపురంలోని ఓ టైర్ రిట్రేడింగ్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటల్లో టైర్లు తగలబడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంతేకాదు సమీప కాలనీల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలతో ఊపిరాడక స్థానికులు పరుగులు పెట్టారు. దాంతో ముందు జాగ్రత్తగా గోదాం చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లలో ఉండే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై గోదాం నిర్వాహకులు, స్థానికులను పోలీసులు ఆరా తీస్తున్నారు. దీపావళి కావడంతో బాణాసంచా రవ్వలు పడి ప్రమాదం సంభంవించిందా? షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేదంటే ఇంకేమైనా కారణముందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Diwali 2019, Fire Accident, Hyderabad