హోమ్ /వార్తలు /తెలంగాణ /

అలా చేశారో కఠిన చర్యలు.. సీపీ మహేష్ భగవత్ హెచ్చరిక..

అలా చేశారో కఠిన చర్యలు.. సీపీ మహేష్ భగవత్ హెచ్చరిక..

మీడియాతో మాట్లాడుతున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ (

మీడియాతో మాట్లాడుతున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ (

ప్రజలందరూ మే ఏడో తేదీ వరకు లాక్‌డౌన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రజలు నిత్యావసరాలు కోనుగోలు చేసుకోవచ్చని సీపీ చెప్పారు.

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అయితే అత్యవసర సమయాల్లో ప్రయాణించేందుకు అనుమతించే పాసులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రజలందరూ మే ఏడో తేదీ వరకు లాక్‌డౌన్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ప్రజలు నిత్యావసరాలు కోనుగోలు చేసుకోవచ్చని సీపీ చెప్పారు. ఇదిలావుంటే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో ఒకరు ఇప్పటికే మరణించగా, ఆరుగురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు పేర్కొన్నారు. ఇదీకాక నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించామని తెలిపారు. వారికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.

First published:

Tags: Coronavirus, Rachakonda, Telangana Police

ఉత్తమ కథలు