• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • MAHESH BABU CALLS PEOPLE TO PARTICIPATE IN KOTI VRIKSHARCHANA ON CM KCR BIRTHDAY SK

Mahesh Babu: సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్.. మొక్కలు నాటిన మహేష్ ఫ్యామిలీ

Mahesh Babu: సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్.. మొక్కలు నాటిన మహేష్ ఫ్యామిలీ

సీఎం కేసీఆర్, మహేష్ బాబు

సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున అందరూ మొక్కలు నాటాలని మహేష్ బాబు కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు.

  • Share this:
    తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) బర్త్‌డే సమీపిస్తోంది. ఫిబ్రవరి 17న ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నాళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యసభ్యుడు సంతోష్ కుమార్.. సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 17న ఉదయం 10-00 గంటల నుంచి 11-00 గంటల వరకు కేవలం ఒక గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని టీఆర్ఎస్ నేతలు పిలుపునిస్తున్నారు. తాజాగా మహేష్ బాబుతో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేష్ బాబుతో పాటు గౌతమ్, సితార మొక్కలు నాటారు.

    సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున అందరూ మొక్కలు నాటాలని మహేష్ బాబు కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలంటే మొక్కలను పెంచడమే మన వద్ద ఉన్న పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.

    కేసీఆర్ బర్త్ డే రోజున బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బంగారు చీరను సమర్పించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇప్పటికే తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దాతల సహకారంతో 2.5 కేజీల బంగారంతో రూపొందించిన చీరను అమ్మవారికి సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.


    ఉజ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాట్లుచేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు