Home /News /telangana /

MAHBUBNAGAR POSTAL DEPARTMENT HAS PROVIDED AN OPPORTUNITY TO SEND RAKHIS TO THE SOLDIERS AT THE BORDER MBNR PRV

Rakhi to jawan | Post office: బార్డర్​లో సైనికులకు రాఖీలు పంపాలా? పోస్టాఫీసు ద్వారా పంపొచ్చు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశానికి స్వాతంత్య్రం (Independence) వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహా ఉత్సవ్ అనే కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ (Post Office) ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (Sayyad rafi, News18, Mahabubnagar)

    దేశానికి స్వాతంత్రం (Independence) వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదికా అమృత్ మహా ఉత్సవ్ అనే కార్యక్రమంలో భాగంగా తపాలా శాఖ (Post Office) ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. తపాలా శాఖలు రోజురోజు అభివృద్ధి బాటలో ముందుకెళ్తుంది. తపాల శాఖకు సంబంధించిన ఒకప్పుడు ఖాతాదారులు తక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అంతేకాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో (Mahbubnagar) తపాల శాఖకు సంబంధించిన కార్యాలయాలు వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో శ్రీరాముల కళ్యాణం సంబంధించిన ప్రసాదం తో పాటు కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి మహబూబ్​నగర్​ తపాలా శాఖ (Post Office) శ్రీకారం చుట్టింది.

    సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు (Jawan) సోదరుల భావించి పౌరులు రాఖీలు (Rakhi) పంపించేలా వినూత్న కార్యక్రమానికి తపాల శాఖ శ్రీకారం చుట్టింది. దీనికి రాఖీస్ టు జవాన్ (Rakhis to jawan) అని పేరు పెట్టింది. హర్ ఘర్ తిరంగా (Har ghar Tiranga) పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 20, 30 ఇంచుల పరిమాణం ఉండే త్రివర్ణ పతాకాలను రూ. 25 లకు అన్ని తపాలా కార్యాలయాలు విక్రయిస్తున్నారు.



    దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహా ఉత్సవంలో  (Azadhi ka mahotsav) భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు మహబూబ్నగర్ తపాలా శాఖ డివిజన్ పర్యవేక్షకుడు సిహెచ్ శ్రీనివాస్ రావు వనపర్తి డివిజన్ పర్యవేక్షడు వెంకటేశ్వర్లు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటి మీద జాతీయ జెండా (National Flag)ను ఎగురవేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు తపాలా కార్యాలయంలో జాతీయ పతాకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

    Hyderabad Student scholarship: అదరగొట్టాడుగా.. హైదరాబాద్ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్​షిప్​.. 

    పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఇలా ఎవ్వరైనా సైనికులకు రాఖీలు పంపించి దేశభక్తిని సైనికుల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేయవచ్చు. ఇందుకు రాఖీలు పెట్టి మూసివేసిన కవర్పై 1- సి బి పి ఓ న్యూ ఢిల్లీ అనే చిరునామ రాసి రూ. 41 చెల్లిస్తే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఈ రాఖీలను సరిహద్దుల్లోని సైనికులకు అందజేసేందుకు ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఏర్పాటు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న తపాల శాఖకు స్థానిక ప్రజలు తపాల శాఖ ఖాతాదారులు అభినందిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Army, Jawan, Mahabubnagar, Post office, Rakhi purnima 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు