హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన జిల్లా కలెక్టర్ .. సార్ షడన్‌ ఎంట్రీతో స్టాఫ్ షాక్

Telangana : ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన జిల్లా కలెక్టర్ .. సార్ షడన్‌ ఎంట్రీతో స్టాఫ్ షాక్

collector visit

collector visit

Collector inspection: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి వైద్య సేవలందుతున్నాయి. వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు, చేసే పరీక్షలపై పూర్తి విషయాలు తెలుసుకునేందుకు స్వయంగా జిల్లా అధికారే హాస్పిటల్‌కి వెళ్లారు.

ఇంకా చదవండి ...

  (Syed Rafi, News18,Mahabubnagar)

  ఓవైపు వర్షాలు...మరోవైపు వరదలు తెలంగాణను అయోమయంలో పడేస్తున్నాయి. వాతావరణం మారడంతో ప్రజలు సీజన్ వ్యాధులు(Seasonal diseases), విషజ్వరాల(Poisonous fevers) బారినపడకుండా ఉండేందుకు తగిన చర్యలు, అవగాహన కల్పించాలని ప్రభుత్వం , రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే మహబూబ్‌నగర్ (Mahbubnagar)జిల్లా కలెక్టర్ ఎస్‌ వెంకటరావు(Collector S Venkata Rao)జిల్లాలోని దేవరకద్ర(Devarakadra)ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. శుక్రవారం(Friday) ఆకస్మిక పర్యటనలో భాగంగా ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్ ఐసీయూ కాళీగా ఉండడం పట్ల స్థానిక డాక్టర్‌తో మాట్లాడారు. ఐసీయూ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, సీరియస్ కేసులను ఐసీయూలో ఉంచాలని సూచించారు.

  Rain alert : మరో 24గంటల పాటు హైదరాబాద్‌లో కుంభవృష్టి .. అత్యవసరమైతే తప్ప ఇల్లు కదలకండి : వాతావరణకేంద్రం


  ఆసుపత్రికి వెళ్లిన జిల్లా కలెక్టర్ ..

  జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి వార్డును సునిశితంగా పరిశీలించారు. అన్నీ వార్డుల్లో కలియ తిరిగారు. ఓపి, లేబర్ వార్డు, ఎమర్జెన్సీ వార్డు, ల్యాబ్, ఫార్మా వంటి ప్రతి విభాగానికి వెళ్లి అక్కడి పరిస్థితులు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలను క్షణ్ణంగా పరిశీలించారు జిల్లా కలెక్టర్. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులతో పాటు ట్రీట్‌మెంట్ పొందుతున్న పేషెంట్లను మాట్లాడారు. జక్కనపల్లికి చెందిన లక్ష్మీదేవిని ఏ సమస్య కారణంగా ఆసుపత్రికి వచ్చారంటూ అడిగారు కలెక్టర్. కడుపు నొప్పి, కాళ్ల నొప్పి ఉండటంతో ఆసుపత్రికి వచ్చినట్లుగా బాధితురాలు కలెక్టర్‌కి చెప్పింది.

  ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ ..

  దేవరకద్ర మండలం గోపులాపూర్ కు చెందిన ఆంజనేయులు అనే పేషెంట్‌తో మాట్లాడారు కలెక్టర్. ఆసుపత్రిలో రోగులను వైద్యులు ఎలా ట్రీట్‌ చేస్తున్నారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి అంటూ పలు విషయాలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నారా? మందులు, ట్రీట్‌మెంట్ చేస్తున్నందుకు ఏవైనా డబ్బులు తీసుకుంటున్నారా? మందులను బయటికి రాస్తున్నారా? అని ప్రశ్నించారు కలెక్టర్ వెంకటరావు. అందుకు పేషెంట్‌ లేదని ఉచితంగానే మందులిస్తున్నారని బాగానే చూస్తున్నారని సమాధానం ఇచ్చారు.

  TELANGANA : ఆ జిల్లా జడ్పీటీసీల దుబాయ్ ట్రిప్ ఫిక్సైంది .. డబ్బులు ఖర్చు చేసి తీసుకెళ్తోంది ఎవరంటే ..  ప్రజల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా..

  జిల్లా కలెక్టర్  ప్రసూతి వార్డులోని బాలింతతో కూడా మాట్లాడారు. కేసిఆర్ కిట్టును అందజేశారు. మరో బాలింతతో మాట్లాడిన కలెక్టర్ బరువు తక్కువగా పుట్టిందని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారని చెప్పడంతో వెంటనే కలెక్టర్ మహబూబ్‌నగర్‌లోని ప్రధాన ఆసుపత్రి డాక్టర్ జీవన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బేబీ బరువు, ఆమెకు అందిచాల్సిన ట్రీట్‌మెంట్‌పై జిల్లా కలెక్టర్ స్వయంగా ఆసుపత్రి ప్రధాన డాక్టర్‌కు సూచించారు. పేషెంట్‌లు, వార్డులను పరిశీలించిన అనంతరం ల్యాబ్‌ను తనిఖీ చేశారు. టీ హబ్ కు ప్రతిరోజు పంపిస్తున్న  శ్యాంపిల్  వివరాలు, వస్తున్న రిపోర్టును అడిగి తెలుసుకున్నారు.  ప్రతి రోజు 14 నుండి 17 శ్యాంపిల్స్‌ను పంపిస్తున్నట్లుగా చెప్పారు. రిపోర్ట్స్ రావడం లేదని ఫోన్‌ల ద్వారా రోగులకు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. చివరగా ఆసుపత్రి డాక్టర్ రాఘవేంద్రతో మాట్లాడిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని...అన్నీ సౌకర్యాలు ఉపయోగపడాలని సూచించారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahabubnagar, Telangana News

  ఉత్తమ కథలు