(Syed Rafi, News18,Mahabubnagar)
తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ (KCR)జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు తమకు నచ్చిన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 14ఏళ్ల పాటు ఉద్యమ సారధిగా, 8ఏళ్లుగా రాష్ట్ర సంక్షేమ సారధిగా తెలంగాణను, పార్టీని ముందుకు నడిస్తున్న కేసీఆర్ 69వ జన్మదినం(Birthday) సందర్బంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో, వీడియో పాటను ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud)ఆవిష్కరించారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ ప్రతి సంవత్సరం ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేయడాన్ని మంత్రి అభినందించారు. ఈ ఆడియో, వీడియో సాంగ్ రూపకల్పనకు సహకారం అందించిన పాట రచయిత పుట్ట శ్రీనివాస్, గాయకుడు రాంకీ, సంగీత దర్శకులు రాజ్ కిరణ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.
సంక్షేమ సారధికి శుభాకాంక్షలు..
తెలంగాణ ఉద్యమ నిర్మాత, సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రూపొందించిన ఆడియో, వీడియో ప్రత్యేక గీతం రాష్ట్ర యువజన, క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14ఏళ్లు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్..చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారు. అదే పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులను నింపుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
కేసీఆర్ బర్త్‌డే సాంగ్..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అనాటి ఉద్యమకారుడు , నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించారన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి కేసీఆర్ పుట్టినరోజులు పురస్కరించుకొని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ ప్రతి సంవత్సరం ప్రత్యేక గీతాన్ని రూపొందించి విడుదల చేయడాన్ని మంత్రి అభినందించారు.
నాడు పోరాటం..నేడు అభివృద్ధి..
ఈ ఆడియో, వీడియో సాంగ్ రూపకల్పనకు సహకారం అందించిన పాట రచయిత పుట్ట శ్రీనివాస్, గాయకుడు రాంకీ, సంగీత దర్శకులు రాజ్ కిరణ్ లను మంత్రి అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు సముద్ర, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లే లక్ష్మణ్ రావు గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు రాజయ్య గౌడ్, ప్రేమ్ సాగర్ శ్రీశైలం, వహీద్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana News