హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubnagar: స్త్రీ నిధి రుణం..మహిళలకు వరం..నిమిషాల్లోనే చేతికి రుణం

Mahabubnagar: స్త్రీ నిధి రుణం..మహిళలకు వరం..నిమిషాల్లోనే చేతికి రుణం

స్త్రీనిధి రుణం

స్త్రీనిధి రుణం

స్త్రీ నిధితో మహిళలకు జీవన ఉపాధి కల్పనలో ఎంతో ఆర్థిక స్వలంబన జరుగుతుంది. పాలమూరు పట్టణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి బుధవారం స్త్రీనిధి బ్యాంకు నిర్వహిస్తున్న సువిధ రుణ దినాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే రూ.30 వేల నుంచి మూడు లక్షల వరకు రుణాలు పొందుతూ తమకు నచ్చిన స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థిక స్వలంబన దిశగా సాగుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

(Syed Rafi, News18,Mahabubnagar)

స్త్రీ నిధితో మహిళలకు జీవన ఉపాధి కల్పనలో ఎంతో ఆర్థిక స్వలంబన జరుగుతుంది. పాలమూరు పట్టణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి బుధవారం స్త్రీనిధి బ్యాంకు నిర్వహిస్తున్న సువిధ రుణ దినాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తక్కువ వడ్డీకే రూ.30 వేల నుంచి మూడు లక్షల వరకు రుణాలు పొందుతూ తమకు నచ్చిన స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థిక స్వలంబన దిశగా సాగుతున్నారు. రుణం అవసరమైన మహిళలు బుధవారం మహబూబ్ నగర్ పూరపాలిక సంఘం కార్యాలయం వద్ద ఉండే సమైక్య భవనానికి చేరుకుంటారు. అక్కడ ఉండే స్త్రీనిధి బ్యాంకు అధికారి సంఘం కార్యకలాపాలు సభ్యురాలి వ్యవహారం వివరాలు గత లావాదేవీలు తెలుసుకొని ఆన్లైన్ లో నమోదు చేసుకున్నారు.

Karimnagar: బామ్మర్దిని చంపడానికి బావ పక్కా స్కెచ్..కానీ చివరకు ఏం జరిగిందంటే?

నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి రూ.లక్షల్లో రుణం మంజూరు చేస్తున్నారు. దానితో పాటు రుణం తీసుకున్న వారిపై శ్రీనిధి ద్వారా పొందుతున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవిత బీమా కూడా వర్తింప చేస్తున్నారు. తీసుకున్న రుణం పై రెండు శాతం బీమా ప్రీమియంగా నిర్ణయించి రుణంలోని కలిపి నెలవారీగా వాయిదాలు చెల్లించిన ఏర్పాటు చేస్తున్నారు. ఒక సభ్యురాలు వ్యక్తిగత రుణం తీసుకుంటే రుణం పై రెండు శాతం అంటే రెండువేల భీమా ప్రీమియంగా నిర్ణయిస్తున్నారు. ఆ ప్రీమియం కూడా కలిపి రూ.ఒక్క లక్ష రెండు వేల రూపాయలు మంజూరు చేస్తారు. రుణము తీసుకున్న సభ్యులు ఒకవేళ చనిపోతే వాయిదాలుగా చెల్లించిన సొమ్మును నామినీకి స్త్రీ నిధి బ్యాంకు చెల్లిస్తుంది మిగిలిన వాయిదాలు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా రద్దు చేస్తారని శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ మాధవి తెలిపారు.

Subsidy Loans: గుడ్‌న్యూస్.. మైనారిటీలకు సబ్సిడీ లోన్లు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు.. అర్హత వివరాలు ఇవే

శారద సరస్వతి గ్రూప్ మహిళా సంఘం సభ్యురాలు..స్త్రీ నిధి నుండి లక్ష రూపాయలు పాల షాపు కొరకు ఋణం తీసుకోవడం జరిగింది. లాక్ డౌన్ కాలంలో ఉపాధి లేకుండా పోవడంతో స్త్రీ నిధి ఇచ్చిన రుణంతో మంచి పాల షాపు పెట్టుకోవడం జరిగింది. దానితో నెలవారి పద్ధతిలో రుణము తీర్చుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆమె తెలిపారు.

ప్రీతి రేణుక కలెక్షన్..శ్రీనిధి ద్వారా రుణము తీసుకొని మహబూబ్నగర్ పట్టణంలోని బట్టల షాప్ పెట్టుకోవడం జరిగిందని ఆమె అన్నారు. గతంలో డబ్బులు లేక చిన్నగా షాపు పెట్టుకొని నడిపించే వాళ్ళము. స్త్రీ నిధి ద్వారా లక్ష రూపాయలు రుణం ఇచ్చిన తర్వాత షాపుని పెద్దగా చేసుకొని ఎక్కువ బట్టలు తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. శ్రీనిధి ద్వారా మా కుటుంబానికి ఒక ఆధారం లభించిందని ఆమె అన్నారు.

First published:

Tags: Mahabubnagar, Telangana

ఉత్తమ కథలు