హోమ్ /వార్తలు /తెలంగాణ /

పోలీస్ స్టేషన్ కు వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని అనిపించాలి: డీఐజీ

పోలీస్ స్టేషన్ కు వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని అనిపించాలి: డీఐజీ

మాట్లాడుతున్న పోలీస్ అధికారులు

మాట్లాడుతున్న పోలీస్ అధికారులు

పోలీస్ స్టేషన్ కు వెళ్తే సామాన్య ప్రజలకు సైతం సత్వరం న్యాయం జరుగుతుందని నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని జోగులాంబ డిఐజి ఎల్ ఎస్ చౌహన్ పోలీస్ అధికారులకు సూచించారు.  వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఒక్కొక్కరి పని తీరు వారి విధానాలను గురించి చర్చించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Syed Rafi, News18,Mahabubnagar)

పోలీస్ స్టేషన్ కు వెళ్తే సామాన్య ప్రజలకు సైతం సత్వరం న్యాయం జరుగుతుందని నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలని జోగులాంబ డిఐజి ఎల్ ఎస్ చౌహన్ పోలీస్ అధికారులకు సూచించారు.  వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఒక్కొక్కరి పని తీరు వారి విధానాలను గురించి చర్చించారు.

Kishan Reddy: 'తొందరెందుకు కేసీఆర్ ..రాజ్ భవన్ లో రాజీనామా లేఖ ఇవ్వక తప్పదు'

ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ..నేరాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పగలు రాత్రి గట్టి పెట్రోలింగ్ బీట్లు నిర్వహించాలని, బ్లూ కోర్టు, పెట్రోల్  మొబైల్ పోలీస్ సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100  ఫిర్యాదు పై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. ఫంక్షనల్,  వర్టికల్స్ గురించి వారి యొక్క పని తీరు గురించి అడిగి తెలుసుకుని స్టేషన్లో వివిధ వర్టికల్స్ లో సిబ్బంది పోటీతత్వంతో పని చేసి మెరుగైన అభివృద్ధి సాధించాలని తెలిపారు.

Kamareddy Master Plan: తెలంగాణ సర్కార్ కు హైకోర్టు కీలక ఆదేశాలు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా నేర నియంత్రణ చేయవచ్చుని అన్నారు. నేరస్తులను పట్టుకోవడమే కాక సరైన ఆధారాలతో నేరస్తులకు శిక్షలు పడే విధంగా సరైన సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం పీడీ ఫైల్స్ పొందుపరచాలని సూచించారు. ప్రో యాక్టివ్ పోలీసింగ్ పై అధికారులు సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు.  కేసుల దర్యాప్తులో జాప్యం సరికాదని,  నాణ్యతతో కూడిన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

పెండింగ్ లో ఉన్న కేసుల్లో సీసీ కెమెరాలు త్వరగా తీసుకోవాలని సూచించారు. గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలని, సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు,  యువకులకు, గ్రామాల వీపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, డిఎస్పి ఆనంద్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసచారి, కొత్తకోట సిఐ శ్రీనివాస్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జగన్,  వెంకట్, వనపర్తి జిల్లాలోని ఎస్ఐలు, డీఎస్పీలు, సిబ్బంది  ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

First published:

Tags: Mahabubnagar, Telangana

ఉత్తమ కథలు