హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: వ్యాపారుల్ని వదలని ప్రభుత్వ అధికారులు .. కొత్త ఐడియాతో డబ్బు వసూళ్లు

Telangana: వ్యాపారుల్ని వదలని ప్రభుత్వ అధికారులు .. కొత్త ఐడియాతో డబ్బు వసూళ్లు

Mahabubnagar

Mahabubnagar

Telangana:ఎన్నో ఆశలు, ప్రణాళికలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వ్యాపారులకు ప్రభుత్వంలోని అన్నీ శాఖలకు చెందిన అధికారులు తమ ఉద్యోగాలను అడ్డుపెట్టుకొని క్యాలెండర్ డైరీల ముద్రణ పేరుతో వసూళ్లకు దిగడం వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది. ఇదేంటని ప్రశ్నిస్తే తనిఖీల పేరుతో ఇబ్బంది పెడతామని బాహాటంగానే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారట.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(Syed Rafi, News18,Mahabubnagar)

కొత్త సంవత్సరం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది క్యాలెండర్ దానిని ఆసరాగా చేసుకొని  కొందరు క్యాలెండర్లు, డైరీల పేరుతో మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో వ్యాపారుల్ని ముక్కు పిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నో ఆశలు, ప్రణాళికలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వ్యాపారులకు ప్రభుత్వంలోని అన్నీ శాఖలకు చెందిన అధికారులు తమ ఉద్యోగాలను అడ్డుపెట్టుకొని క్యాలెండర్(Calendars),డైరీల (Diaries)ముద్రణ పేరుతో వసూళ్లకు దిగడం వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ వ్యాపారుల స్థాయిని, వారికి ఇష్టం వచ్చినంత కాకుండా తాము డిమాండ్ చేసినంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.

SAD NEWS: తమ్ముడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే అన్న మృతి .. అసలేం జరిగిందంటే..?

ఇదెక్కడి అన్యాయం..

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి సుమారు 10రోజులు గడిచినప్పటికి ముద్రణ పేరుతో అంకా వసూళ్లు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు వ్యాపారులు.ఇదేమిటని ప్రశ్నిస్తే తమకు ప్రకటనలు ఇవ్వకుంటే దుకాణాలను తనిఖీ చేస్తామని ఏదో ఒక లోపం చూపించి చర్యలు చేపడతామని భయపెడుతున్నడంతో గత్యంతరం లేని వ్యాపారులు బాధపడుతూనే డబ్బులు ఇస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలు మొదల్కొని మండలాలు, గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితిలో వసూల్ రాజాలుగా మారారు ప్రభుత్వ అధికారులు.

క్యాలెండర్లు, డైరీల పేరుతో ..

మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మందబాద్, గండీడ్ మండలాల్లో రూముకు 30 వేల వరకు వసూలు చేసినట్లు మండల జిల్లా అధికారులు ఒత్తిడి తెచ్చి వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు కొన్నిచోట్ల గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలోనూ వసూళ్లకు దిగారు. ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి క్యాలెండర్లను ముద్రించారు. మద్యం దుకాణాల నుంచి 20 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేశారు ఈ విషయంపై కొంతమంది అధికారులను వివరణ మా దృష్టికి రాలేదని చెప్పుకుంటూనే కొంతమంది సంఘాల తరఫున వసూలు చేశారని ఎక్కడ వ్యాపారులను బలవంతం చేయలేదని తెలిపారు. సంఘాల నాయకులను అడిగితే  తాము ముద్రించ లేదని రాష్ట్ర జిల్లా నాయకులకు పంపించామని తప్పించుకుంటున్నారు.

వసూల్ రాజాలు..

ఒక్కో మండలంలో లక్షల రూపాయలను టార్గెట్‌గా పెట్టుకొని అధికారులు తమ శాఖ పరిధిలోకి వచ్చే వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని వసూలు చేపడుతున్నారు. ఒక్క మండలంలో రూ లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేటలో ఒక మండల అధికారి ఇద్దరు వ్యాపారులను మధ్యవర్తిగా పెట్టి ఒక్క దుకాణం నుంచి పదివేలను వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ రూ 1.25 లక్షల ను సేకరించారు భూత్పూర్ మండల కేంద్రంలో రూ 3.4 లక్షల వసూలు చేశారు ఇలా సేకరించిన డబ్బులు జిల్లా రాష్ట్ర సంఘాల నాయకులకు పంపించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఎక్కువ వసూలు చేసిన జిల్లా రాష్ట్ర సంఘాలకు తక్కువ పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Nikhat Zareen: బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు టీపీసీసీ సన్మానం .. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

తిలా పాపం తలా పిరికెడు..

రెవెన్యూ, విద్యుత్, తూనికలు కొలతలు, ఎక్సైజ్, పోలీసు, అగ్రికల్చరల్, పౌరసరఫరాలు,నీటి వనరులశాఖల అధికారులు కొందరు ఇంకా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని కొందరు వ్యాపారులు ఎదురు తిరిగి స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చి అధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

First published:

Tags: Mahabubnagar, Telangana News

ఉత్తమ కథలు