(Syed Rafi, News18,Mahabubnagar)
తెలంగాణూ(Telangana)లో వలస జీవుల జిల్లా ఏదీ అంటే ముందు వరుసలో ఉండేది మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్నే మార్చుకుంది. గతంలో ఎడారిలా ఉండే జిల్లా ఇప్పుడు ఉపాధి మార్గాలు, ఉద్యోగాలు అవకాశాలు, పరిశ్రమల్లో పనులతో జీవనోపాధి కోసం వలసవాదులకు అవకాశం ఇచ్చే విధంగా మారింది. మహబూబ్‌నగర్ మండల పరిధిలోని డివిటిపల్లి(Devitipalli) గ్రామ శివారులో ఓ భారీ పరిశ్రామిక వాడ ఏర్పాటుకోబోతోంది. దీంతో పాటు జిల్లాలో మరికొన్ని భారీ పరిశ్రమలు నెలకోల్పుతున్నారు.
అభివృద్ధిలో పరుగులు..
కొన్నేళ్ల క్రితం ఏదైనా పని చేయాలంటే, ఉపాధి కావాలంటే మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలు బొంబై, బాంబే పూణె వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారు. కానీ ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లా పరిధిలోని జడ్చర్లలో ఇప్పటికే పేరుగాంచిన పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాక ఈ మధ్యకాలంలో డివిటిపల్లి గ్రామ శివార్లో పెద్ద పారిశ్రామికవాడ ఏర్పడుతుంది. అది ఏర్పడడంతో వేల మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కలుగునున్నాయి. పాలమూరు కేంద్రంగా పారిశ్రామిక ప్రగతి పండుకుంది.
పరిశ్రమలతో అందరికి పనులు..
వలస జిల్లాలో గత కొన్నేళ్లుగా పారిశ్రామికరణ వేగం పుంజుకోవడంతో వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్‌నగర్ శివారులోని డివిటిపల్లిలో ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ పార్క్ టవర్ నిర్మాణం పూర్తయింది. త్వరలో ఇక్కడికి సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు పరిశ్రమలు రానున్నాయి. ఈ ప్రాంతంలో ఐటీ కం మల్టీపర్పస్ పరిశ్రమలవాడను ఏర్పాటు చేయడానికి టిఎస్ఐఐసి 371 ఎకరాలను కేటాయించింది త్వరలోనే డివిటిపల్లికి మరో భారీ పరిశ్రమ రానుంది.
పెద్ద కంపెనీలకు అడ్డా..
ఈ నెల 2వ తేదీన అమరరాజా సంస్థతో ప్రభుత్వం ఈ ప్రాంతంలో లిథియం బ్యాటరీల కర్మాగారం పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంది. సుమారు రూ.9500 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు కానున్న నేపథ్యంలో దాదాపు ఈ పరిశ్రమలు 4500 మందికి ఉపాధి అవకాశాలు లభించునున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో జడ్చర్ల సమీపంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పేరుందిన ఫార్మా కంపెనీలు ఉన్నాయి. బాలనగర్, రాజాపూర్ మండలాల్లో సుమారు 50కి పైగా ఐరన్ జిన్ని పరిశ్రమలు ఉన్నాయి.
రూపు రేఖలు మారుతున్నాయ్..
డిప్యూటీపల్లి జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. ఈ ప్రాంతం శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గంట వ్యవధిలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు పాలమూరులో మినీ విమానాశ్రయానికి కూడా కేంద్రంలో గతంలో పచ్చజెండా ఊపింది. మహబూబ్‌నగర్ చుట్టూ పక్కల స్థల పరిశీలన కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడ అభివృద్ధికి దోహదం చేనున్నాయి.2015 జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు టీఎస్ ఐ పాస్ ద్వారా వచ్చిన పరిశ్రమలు వివరాలు ఇలా ఉన్నాయి.
8ఏళ్లలో జిల్లాలో మార్పు..
మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 295 యూనిట్‌లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఫలితంగా 6.417.కొట్లలో ఆదాయం వస్తోంది. ఈ పరిశ్రమల ద్వారా 22.587ఉపాధి అవకాశాలు దక్కాయి. నాగర్‌కర్నూల్-153,1509,3224, వనపర్తి-77,1416,2838, జోగులంబ గద్వాల-91,2,219,1,826 ఉండగా.. నారాయణపేట-49,979,1,435 ఉపాది అవకాశాలు కలిగాయి. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యే నాటికి మహబూబ్‌నగర్ జిల్లా మరో అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారడంలో అతిశయోక్తి లేదంటున్నారు జిల్లా ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Telangana News