పెళ్లైన ఐదు రోజులకే ఓ డాక్టర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన అబ్దుల్ మోసిన్ 29 యునాని వైద్యుడిగా పని చేస్తున్నాడు. అతనికి ఈనెల 15న సిద్దిపేట జిల్లాకు చెందిన అమీనా తపస్సుతో పెళ్లి అయింది. హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో.. భార్యతో కలిసి కారులో బయలుదేరాడు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వద్ద 44 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు, డీసీఎం ఢీ కొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోసిన్ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇక, మోసిన్ కుటుంబంలో 3 నెలల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మోసిన్ తండ్రి తన్వర్ ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. అన్వర్ నలుగురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరు వైద్యులు కాగా, ఒక కుమారుడు బీటెక్ చదివాడు. అక్టోబర్ నెలలు రెండో కుమారుడు డాక్టర్ జాహిద్ వర్షంలో మిద్దె పై నుంచి దిగుతూ కాలుజారి కిందపడి తలకు బలమైన గాయమై మృతి చెందాడు. కొడుకు మరణ వార్త విని తండ్రి అన్వర్ గుండెపోటుతో అదే రోజు మరణించాడు. తాజాగా మూడో కుమారుడు మోసిన్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
మరో మోసిన్ మరణంతో అమీనా కుటుంబంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లైనా ఐదు రోజులకే ఇలా జరగడంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.