హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ఆడవాళ్ల నగ్నఫోటోలు తీసిన కేసులో నిందితులు అరెస్ట్ ..పరారీలో ప్రధాన నిందితుడు

OMG: ఆడవాళ్ల నగ్నఫోటోలు తీసిన కేసులో నిందితులు అరెస్ట్ ..పరారీలో ప్రధాన నిందితుడు

nude photos case

nude photos case

OMG:ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటోలు తీసి పంపితే మీకు ఆర్ధిక పరిస్థితి బాగుపడే మార్గం చూపిస్తామంటూ ఆడవాళ్లను మోసం చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జాతకం, స్వామీజీ పేరుతో డ్రామాలాడిన గ్యాంగ్‌లో అసలు నిందితుడు పరారీలో ఉండగా మిగిలిన వాళ్లను పట్టుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

(Syed Rafi, News18,Mahabubnagar)

మహబూబ్‌నగర్ Mahabubnagarజిల్లాలో మహిళల న్యూడ్ ఫొటోలు nude photos, వీడియోలు తీసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈకేసులో ఆడవాళ్లు, యువతులను టార్గెట్‌గా చేసుకొని జాతకం పేరుతో ఆర్ధిక పరిస్థితులు మారుతాయంటూ నమ్మబలికిన గ్యాంగ్‌ను పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. ఈముఠాలో మొత్తం నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా జడ్చర్ల(Jadcharla) పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు తిరుపతి (Tirupati)పరారీలో ఉన్నట్లుగా చెప్పారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్న ఫోటోలు పంపిచే స్వామీజీ పుట్టుమచ్చలు చూసి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ పెట్టి ట్రాప్ చేసినట్లుగా తేలింది.

న్యూడ్ ఫోటోల కేసు నిందితులు చిక్కారు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మహిళల న్యూడ్‌ ఫోటోల వ్యవహారంలో జడ్చర్ల పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని ఓ ముఠా డబ్బు ఆశ చూపించి మోసం చేసింది. మీ ఫొటోలు, ప్రత్యేకించి హస్తరేఖల ఫొటోలు పంపినట్లయితే స్వామీజీ మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం మార్గం చూపుతూ కోట్ల రూపాయలు సమకూరేలా మార్గం చూపిస్తారని హైదరాబాద్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి మరికొందరితో కలిసి ఆడవాళ్లను ట్రాప్‌లోకి లాగారు.

18-30ఏళ్ల వయసున్న ఆడవాళ్లే టార్గెట్..

ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఒంటిపై దుస్తులు లేకుండా దిగిన ఫోటోలను స్వామీజీకి (దిగంబరంగా) పంపితే వాటిలో పుట్టుమచ్చలు చూసి మీకు ధనయోగం కలిగే ఆలోచన, మార్గం చూపిస్తాని మోసం చేశారు. మాటలు నమ్మిన మహిళలు తమకు నష్టం ఉండదని భావించి హస్త రేఖలు ఉన్న ఫొటోలు ఇస్తున్నారు. వాటిని పానల్ మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన జలాలుద్దీన్, తిమ్మాజీపేట మండలం కోడిపర్తి గ్రామానికి చెందిన రాములు, ఆమనగల్ మండలం పోలేపల్లికి చెందిన శంకర్, పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ తండాకు చెందిన రాములు నాయక్‌ అనే నలుగురు నిందితులు కలిసి మరో నిందితుడైన తిరుపతికి పంపేవారు.

Crime News: మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సీనియర్ సైఫ్ అరెస్ట్ ..ఏమని వేధించాడో తెలుసా..?

నగ్న ఫోటోల కోసం నయవంచన..

ఆ ఫోటోలు పంపిన తర్వాత మీ ఫొటోలను, హస్త రేఖలను స్వామీజీ చూశారు... మీ ఒంటిపైన పుట్టుమచ్చలు.. దిగంబరంగా ఉండే ఫొటోలను పంపించినట్లయితే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మించినట్లుగా సీఐ వెల్లడించారు. నిజమే అని ఆశపడ్డ 30 మంది మహిళల న్యూడ్ ఫొటోలను తీసి వాటిని తిరుపతి అనే వ్యక్తికి పంపించారు. ఈనెల 18వ తేదీన బాదేపల్లిలో ఓ కాలనీకి చెందిన మహిళ ఇంట్లోకి జలాలుద్దీన్ అనే వ్యక్తి ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీసుకుంటుండగా అనుమానం వచ్చిన కాలనీవాసులు 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ముఠా గుట్టు రట్టైంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని జలాల్లోద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా మిగిలిన వాళ్లను పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారం నడిపిన ప్రధాన నిందితుడు తిరుపతి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published:

Tags: Mahbubnagar, Telangana crime news

ఉత్తమ కథలు