హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubnagar: టీచర్ కాదు దేవుడు..తాను చనిపోతూ 8 మందికి పునర్జన్మ

Mahabubnagar: టీచర్ కాదు దేవుడు..తాను చనిపోతూ 8 మందికి పునర్జన్మ

తాను చనిపోతూ 8 మందికి పునర్జన్మ ఇచ్చిన టీచర్

తాను చనిపోతూ 8 మందికి పునర్జన్మ ఇచ్చిన టీచర్

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూర్ గ్రామ పాఠశాలలో ఇన్చార్జ్ హెడ్మాస్టర్ గా పని చేస్తున్న నాగేందర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే నేను చనిపోయిన నా అవయవాలు నలుగురికి ఉపయోగపడాలని వారి కుటుంబానికి చెప్తూ టీచర్ మృత్యు ఒడికి చేరారు. అయినా 8 మందికి పునర్జన్మ ఇచ్చి అందరి మనసులో ఉండిపోయారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahabubabad, India

(Syed Rafi, News18,Mahabubnagar)

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూర్ గ్రామ పాఠశాలలో ఇన్చార్జ్ హెడ్మాస్టర్ గా పని చేస్తున్న నాగేందర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే నేను చనిపోయిన నా అవయవాలు నలుగురికి ఉపయోగపడాలని వారి కుటుంబానికి చెప్తూ టీచర్ మృత్యు ఒడికి చేరారు. అతని మాట ప్రకారం వారి కుటుంబ సభ్యులు అతని చివరి మాట కాదనలేక హైదరాబాద్ లోని  మలక్ పేట యశోద ఆసుపత్రిలో 8 మంది రోగులకు నాగేందర్ అవయవాలు రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, రెండు కార్నియాలను సేకరించారు. ఆదిలో రెండు అవయవాలను యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అమర్చారు. మిగిలిన వాటిని అపోలో కీమ్స్ సరోజినీ దేవి ఆసుపత్రులలోని రోగులకు అమర్చారు.

Bhadradri Kothagudem: పోలీసుల పనితీరు అభినందనీయమన్న రాష్ట్ర డీజీపీ

నాగేందర్ 25 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. కొంతకాలంలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్యవంతులుగా తీర్చిదిద్దారు. పాఠశాల సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు కృషి చేసేవారు. అటువంటి ఉపాధ్యాయుడు తాను చనిపోతూ కూడా 8 మంది రోగుల జీవితాల్లో వెలుగు ప్రసాదించారు. తాను చనిపోవడానికి వారం రోజులు ముందే విద్యార్థులతో సమావేశమైన నాగేందర్ జీవించి ఉండగానే ప్రతి ఒక్కరు పదిమందికి సాయం చేయాలన్న లక్ష్యం పెట్టుకోవాలంటూ హితబోధ  చేశారని ఇప్పుడు తాను చనిపోతూ పలువురి జీవితాల్లో వెలుగును నింపారని ఆయన శిష్యులు తోటి ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేమని ఆయన భార్య విజయలక్ష్మి రోధిస్తూ అన్నారు. అవయవ దానానికి అంగీకరించిన నాగేందర్ కుటుంబీకులను పలువురు అభినందించారు.

Mulugu: ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టరైతే 5 లక్షల వరకు ఉచిత వైద్యం!

వెంకటేశ్వరమ్మ..10 తరగతి జడ్.పి.హెచ్.ఎస్ డోకూర్..నాగేందర్ సార్ జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలి. మన లక్ష్యం ఏంటి అనే దానిపై నెలలో మూడో శనివారం పేరెంట్స్ మీటింగ్ పెట్టి మా చదువుల పట్ల ఆసక్తి చూపుతూ తల్లిదండ్రులతో మా విషయాలు కనుక్కొని మంచి చదువుని చదువుకోవాలంటూ మాతోపాటు మా తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చి వారికి నచ్చజెప్పి మేము మంచి చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని సార్ కి ఎంతో ఇష్టం ఉండేది. అందుకే మేమందరం కష్టపడి మా సారు మాట నిలబెడతానని మీ మాట ఇస్తున్నామంటూ రోధిస్తూ తెలిపారు.

Bhadradri : మిడ్ డే మీల్స్‌లో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థుల అస్వస్థత

లావణ్య పదవ తరగతి.. సార్ అంటే మాకు ప్రాణం సార్ వల్లనే మేము మా పాఠశాలలో అందరం మంచిగా చదువుకుంటున్నాం. మా ఎదుగుదలకి తోడు నీడగా ఉంటున్న నాగేందర్ సార్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం మాకు చాలా బాధాకరమని విద్యార్థిని లావణ్య తెలిపారు.

టీచర్ నాగేందర్

లచ్చయ్య..ఉపాధ్యాయుడు జెడ్పిహెచ్ఎస్ డోకూర్..మా పాఠశాలలో ఇన్చార్జి హెడ్మాస్టర్ ఉంటూ మమ్మల్ని అందరినీ కలుపుకుంటూ పని చేసుకునే వారని, పాఠశాలలో మాకు పెద్ద దిక్కుగా నాగేందర్ సార్ ఉండేవాడు తాను మరణించిన వార్త విని చాలా బాధపడ్డాము తాను చనిపోతూ కూడా 8 మంది జీవితాన్ని ఇచ్చిన ఉపాధ్యాయుడు నాగేందర్ వారి స్ఫూర్తితోనే మా జీవితాన్ని ముందుకు సాగుతాయని ఆయన అన్నారు.

ఉపాధ్యాయురాలు జడ్పీహెచ్ఎస్ డోకూర్..మేము ఉద్యోగం రాకముందు కలిసి ప్రైవేటు కళాశాలలో పని చేసేటప్పుడు అప్పుడు కూడా నలుగురికి సహాయం చేయాలని తపన తో పాటు విద్యార్థులను బోధించేటప్పుడు అన్ని విషయాలు చెబుతూనే బోధించేవాడని ఆయన స్ఫూర్తితోనే మా పాఠశాల ఉపాధ్యాయులు అంతా ముందుకెళ్తామని ఆమె అన్నారు.

First published:

Tags: Mahabubnagar, Teacher, Telangana

ఉత్తమ కథలు