హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : పేద, ప్రతిభావంతులైన విద్యార్ధులకు సాయం .. పూర్వ విద్యార్ధులు చేస్తున్న గొప్ప పనేంటో తెలుసా..?

Telangana : పేద, ప్రతిభావంతులైన విద్యార్ధులకు సాయం .. పూర్వ విద్యార్ధులు చేస్తున్న గొప్ప పనేంటో తెలుసా..?

Mahabubnagar News

Mahabubnagar News

Telangana: తాము విద్యనభ్యసించిన కళాశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో పూర్వ విద్యార్ధులు ముందుకొచ్చారు. తమ విజయంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్ధులకు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Syed Rafi, News18,Mahabubnagar)

  వారంతా ఇంజనీరింగ్(Engineering)పట్టభద్రులు. తమ ప్రతిభతో ప్రభుత్వశాఖలతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అయితే ఎంత ఎదిగినా తాము విద్యనభ్యసించిన కళాశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. తమ విజయంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్ధులకు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar)ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (Government Polytechnic College)పూర్వ విద్యార్థులు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు.

  Jaggareddy: ఆ కారణంతోనే అర్హులు కూడా పెన్షన్‌కి దూరం .. 3,016రూపాయల పెంచి ఇచ్చేదెప్పుడు : జగ్గారెడ్డి

  కాలేజీ రుణం తీర్చుకునే భాగ్యం..

  మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన 12 మందితో 2018లో ఏర్పడిన పూర్వ విద్యార్థుల సంఘం అందరికి ఆదర్శ ప్రాతంగా మారింది. చదువుకున్న కాలేజీకి రుణం తీర్చుకునేందుకు తమకు తోచిన సాయం చేసేందుకు ఏర్పడిన పూర్వ విద్యార్ధుల సంఘంలో సభ్యుల సంఖ్య 600కి చేరింది. వీరంతా 2018నుంచి ఇప్పటి వరకు తాము చదువుకున్న కాలేజీలో చదువుతున్న నిరుపేద విద్యార్థులతో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించే వారికి ప్రోత్సాహక బహుమతులు, ఉపకార వేతనాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు.

  పూర్వ విద్యార్ధుల సాయం..

  ఏటా 2.5లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇందుకుగాను సంఘం సభ్యులు నుంచి శాశ్వత సభ్యత్వం కోసం ప్రతి ఒక్కరి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటూ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు. డిపాజిట్ చేసిన డబ్బులపై వచ్చే వడ్డీతోపాటు దాతలు నుంచి విరాళాలు సేకరించి నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. విద్యార్థులు చదువుకునే పోటీ పరీక్షలో అవసరమైన పుస్తకాలు, వసతి గృహాల్లో మంచినీటి సదుపాయంతో పాటుగా ఇతర సౌకర్యాలను అందిస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోప వారికి వ్యక్తిత్వ వికాస యోగా తదితరులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగు వేలు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన ఐదు శాఖల స్టూడెంట్స్‌కి 200 నేర్పిన విద్యార్థులకు ఉపకార వేతనం 100 మందికి పైగా ప్రతిభావంతులకు ప్రోత్సాహక నగదులు అందించారు. కళాశాల తరగతి గదుల్లో ఫ్యాన్లు, టేబుల్, లైబ్రరీ వస్తువులు అందించారు.

  Crime news : వివాహితకు మత్తు మందిచ్చారు .. ఆపై ఏం చేశారో తెలుసా..?

  ఇంతింతై వటుడింతైనట్లుగా..

  పాలిటెక్నిక్ కళాశాలలో 1978-81 బ్యాచ్ పూర్వ విద్యార్థిగా ఉన్నటువంటి దేవానంద్ జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 1981లో స్టేట్‌లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అటుపై ఇంజనీరు 2016 2021 గా పనిచేస్తూ మహబూబ్‌నగర్‌ నీటి సరఫరా పథకానికి విజయవంతంగా పూర్తి చేశారు. తమ ద్వారా మరికొందరు విద్యార్ధులకు సహాయం చేసుకునే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. 1990లో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన ఉమామహేశ్వర్ జేఎన్టీయూలో డిప్లొమా బీటెక్ పూర్తి చేసి తర్వాత అమెరికా వెళ్లారు. అక్కడే సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేసి స్వదేశంపై ఉన్న మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చి శ్రీ సాయి కన్స్ట్రక్షన్ సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా ఎంతో మంది యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahbubnagar, Telangana News

  ఉత్తమ కథలు